అంతర్జాతీయం

కర్తార్‌పూర్ సరిహద్దు తెరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 7: ఎంతోప్రసిద్ధిగాంచిన చారిత్రక గురుద్వారను సిక్కు భక్తులు సందర్శించడానికి వీలుగా కర్తార్‌పూర్‌లోని సరిహద్దు మార్గాన్ని తెరుస్తామని, ఎలాంటి వీసాలు లేకుండానే భక్తులు అక్కడకి వెళ్లడాన్ని అంగీకరిస్తామని పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఫవద్ చౌదరి తెలిపారు. కర్తార్‌పూర్ గురుద్వార పాకిస్తాన్ నాటోవల్ జిల్లాలో భారత సరిహద్దుకు సమీపంలో ఉంది. సిక్కుల గురువు గురునానక్ అక్కడ కన్నుమూసారు. దీంతో ఈ ప్రాంతాన్ని దర్శించుకోవడానికి సిక్క్భుక్తులు తహతహలాడతారు. కాగా, త్వరలోనే కర్తాపూర్‌లోని సరిహద్దును సిక్కు భక్తుల కోసం తెరుస్తామని, గురుద్వార దర్బార్ సాహెబ్‌ను వారు ఎలాంటి వీసాలు లేకుండా వచ్చి దర్శించుకోచ్చునని చెప్పారు. బీబీసీతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో పాక్ ప్రభుత్వం, ఆర్మీ ఆధ్వర్యంలో భారత్‌తో జరిగిన శాంతిచర్చల్లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చి నా భారత్ ఈ అంశంపై ఆసక్తిని చూపలేదన్నారు. అయితే ప్రధానిగా ఇమ్రాన్ ఎన్నికైన తర్వాత భారత్‌తో శాంతి సంబంధాల మెరుగుకు ముందడుగు వేశారని, ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన భార త్ ఎంపీ, క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో తమ దేశ ఆర్మీ చీఫ్ హామీని ఇచ్చారని చౌదరి గుర్తు చేశా రు. గత ప్రభుత్వాల హయాంలో కూడా శాంతి చ ర్చలు జరిగాయి కదా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ సమస్యలు అవే ఉన్నాయని, అయితే షరీఫ్ విదేశాంగ విధానానికి, ఇమ్రాన్ పాలసీకి తేడా ఉందన్న విషయం మరువరాదని అన్నారు.