ఆంధ్రప్రదేశ్‌

తప్పుల తడకలుగా ల్యాండ్ రికార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 7: రాష్ట్రంలో ఇప్పటి వరకూ శాశ్వత ప్రాతిపదికన రెవెన్యూ రికార్డులు రూపొందకపోవటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, పట్టణాల్లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన ప్రజలు రిజిస్ట్రేషన్‌ల సమయంలో పలు ఇబ్బందులు పడుతున్నారని శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో టీడీపీ సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, బీజీపీ పక్షనేత విష్ణుకుమార్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఆలపాటి రాజా మాట్లాడుతూ గతంలో రెవిన్యూ రికార్డుల్లో గోల్‌మాల్ జరుగుతున్నదనే కారణంతోనే 1983లో ఎన్టీఆర్ కరణాలు, మున్సబ్‌ల వ్యవస్థను రద్దు చేశారని అన్నారు. వాస్తవాలకు భిన్నంగా రికార్డుల్లో సర్వే నెంబర్‌లు ఉంటున్నాయని దీనివల్ల దశాబ్దాలుగా తమ ఆధీనంలోని భూములకు రిజిస్ట్రేషన్‌లు జరుపుకోలేకపోతున్నారని అన్నారు. ధూళిపాళ్ల మాట్లాడుతూ ఎక్కడో ఓ సెంట్ స్థలం ప్రభుత్వ భూమికైతే ఆ సర్వే నెంబర్ మొత్తాన్ని ప్రభుత్వ భూమిగా చూపుతున్నారని అన్నారు. చుక్కల భూముల్లో ప్లాట్లు కొన్న వారి పేరున రిజిస్ట్రేషన్ జరుగటం లేదన్నారు. విష్ణుకుమార్ మాట్లాడుతూ విశాఖ పరిసరాల్లో రాజకీయ నేతలు ప్రభుత్వ భూముల రికార్డులను తారుమారు చేసి దాదాపు మూడు నుంచి నాలుగువేల ఎకరాల భూములను విక్రయించి ఐదు వేల కోట్ల రూపాయలు స్వాహా చేశారని అన్నారు. దీనిపై ప్రభుత్వ నియమించిన ‘సిట్’ సమగ్రంగా విచారించి నివేదిక అందిస్తే దాన్ని ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు. దీనిపై ఉపముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి స్పందిస్తూ సిట్ నివేదిక అందింది.. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి చర్య తీసుకోగలమన్నారు. 1948 ఆం.ప్ర ఎస్టేట్లు చట్టం, 1956 ఇనాములు చట్టం ప్రకారం 8541 ఇనాం గ్రామాల్లో సర్వే పూర్తయిందని అక్కడి భూములను రైత్వారీ గ్రామాల్లో మార్పిడి చేశామని అన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అయినందున ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామన్నారు. దేవదాయ భూములను ఇళ్ల స్థలాలుగా ఇవ్వటానికి కోర్టు అనుమతి అవసరమన్నారు.