ఆంధ్రప్రదేశ్‌

సంక్రాంతిలోగా వెలుగొండకు నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 7: అధికారం చేపట్టిన ఐదునెలల్లోనే పట్టిసీమ పూర్తిచేశాం.. నాలుగేళ్లలో 205 టీఎంసీల నీటిని కృష్ణాకు తీసుకొచ్చాం.. వచ్చేనెలలో చిత్తూరుకు నీరందిస్తాం.. సంక్రాంతి నాటికి వెలుగొండకు నీటిని తరలిస్తామని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వెల్లడించారు. శుక్రవారం శాసనసభలో ‘నదుల అనుసంధానం’పై లఘు చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులు పూర్తికావచ్చాయని తెలిపారు. వైఎస్ హయాంలో జరిగిన జలయజ్ఞం ధనయజ్ఞంగా మారి రైతులు నష్టపోయిన నేపథ్యంలో తమ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తోందన్నారు. దీన్ని ప్రశ్నిస్తామనే భయంతోనే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా పరారైందని విమర్శించారు. జీతభత్యాలు తీసుకుంటూ సభకు రాకుండా ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డి ఉత్తరకుమారుని ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. వచ్చే నెలలో వైకుంఠపురం లిఫ్టు ఇరిగేషన్ పనులు ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను రూ 56 వేల కోట్ల నిధులతో పాటు నరేగా నిధులు 11 వేల కోట్లతో పూర్తి చేస్తున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులపై కేంద్ర నిపుణులే ప్రశంసలు కురిపించాయని, దేశంలో మరో ఇతర ప్రాజెక్టు ఇంత త్వరితగతిన పూర్తికాలేదన్నారు. దీనిపై దమ్ముంటే శాసనసభలో చర్చించాలని ప్రతిపక్షానికి సవాల్ విసిరారు. ఉత్తరాంధ్ర సుజల- స్రవంతి ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వచ్చేనెలలో శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు. పోలవరం పూర్తయితే వైసీపీకి పుట్టగతులుండవని, పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకరని విమర్శించారు.