ఆంధ్రప్రదేశ్‌

తెలంగాణపైనే లాబీల్లో చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 7: ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శుక్రవారం లాబీల్లో తెలంగాణ రాజకీయాలపైనే ఎక్కువగా చర్చలు జరిగాయి. మొదటి రోజు సభ్యుల హాజరు తక్కువపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసినప్పటికి రెండోరోజు కూడా పరిస్థితిలో మార్పు లేదు. ఇదే సందర్భంలో ఏపీ మంత్రుల పేషీల వద్ద మాత్రం సందర్శకుల తాకిడి ఎక్కువగానే కనిపించింది. అసెంబ్లీ సమావేశాల విరామ సమయంలో మంత్రుల పేషీల్లో తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాలపై చర్చలు జరిగాయి. ఆర్థిక మంత్రి యనమల మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణకు సంబంధించిన అంశాలను పరిష్కరించే విషయంలో కేంద్రం సానుకూలంగానే ఉందన్నారు. మరి ఆంధ్ర విషయంలో ఎందుకో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. తనకు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని గ్రహించిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధపడ్డట్లు ఆభిప్రాయపడ్డారు. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా విధాన నిర్ణయాలు తీసుకోవడం కుదరదన్న ఆయన మధ్యంతర భృతి ప్రకటన చేసినా అమలు చేసే పరిస్థితి ఎంత వరకు ఉంటుంటదోననేది అనుమానమేనన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే విధాన నిర్ణయాల అమలు కుదరదన్న ఆయన పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే ముస్లిం ఓట్లు కాంగ్రెస్‌కు వెళ్తాయనే ఆందోళన కూడా ముందస్తు నిర్ణయానికి కారణం కావచ్చునన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కుల సమీకరణాలు కీలకం కానున్నట్లు మంత్రి పితాని సత్యనారాయణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ సంఘాలు, ఇప్పుడు టీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుందన్న ఆయన ఇదే ఆ పార్టీకి తెలంగాణాలో ఇబ్బందికర పరిస్థితులను తీసుకువస్తాయన్నారు. తెలంగాణలో పొత్తుల వల్ల టీడీపీ లాభపడితే అది ఏపీలో మరింత కలిసి వస్తుందన్నారు.