క్రీడాభూమి

ఎవరో విజేత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 7: ఒకరు తిరుగులేని చాంపియన్. మరొకరు అనూహ్యంగా దూసుకొచ్చిన స్టార్. రసవత్తరంగా సాగనున్న యూఎస్ ఓపెన్ ఫైనల్ పోరులో ఎవరు నెగ్గినా సంచలనమే. ఉత్కంఠ రేకెత్తించే టెన్నిస్ యుద్ధంలో ఎవరు గెలిచినా చరిత్రను తిరగరాసుకోవడమే. ఒకరు తిరుగులేని అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్. మరొకరు సత్తాచాటి ఫైనల్‌కు చేరిన జపాన్ స్టార్ నవోమి ఒసాకా. సెమీ ఫైనల్స్‌లో అనస్తసిజ సెవాస్టోవాను మట్టికరిపించి సెరెనా విలియమ్స్ ఫైనల్‌కు చేరింది. స్టార్ అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ మాడిసన్ కీస్‌ను చిత్తుచేసి జపాన్ కొత్త సంచలనం నవొమి ఓసాకా ఫైనల్‌కు చేరుకుంది. 9న ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో రెండు టెన్నిస్ దిగ్గజాల ఆధిపత్య పోరు ఆసక్తికరమే. సెరెనా గొప్ప ఆటగత్తె కావొచ్చు. కానీ, సర్జరీ ఎదుర్కొని బిడ్డకు జన్మనిచ్చిన తరవాత కూడా అలుపెరుగని ఆటలతో ఫైనల్‌కు చేరడం పట్ల టెన్నిస్ ప్రపంచం విస్మయం వ్యక్తం చేస్తోంది.
‘ఏడాది క్రితం కాన్పుకోసం ఆస్పత్రిలో సర్జరీ ఎదుర్కొని, మంచంమీద శక్తివిహీనంగా పడివున్నా. ఏడాది తిరిగేసరికి ఎలాంటి శిక్షణ లేకుండానే యూఎస్ ఫైనల్‌కు చేరుకున్నా. ఇది నాకే సాధ్యమేమో’ అంటోంది సెరెనా. ‘చాలాదూరం చాలా వేగంగా వచ్చేశాను. ఆశావాదిని. ముందుకే చూస్తుంటా’ అని చమత్కరించింది. సెమీఫైనల్స్‌లో విజయం సాధించిన జపాన్ స్టార్ ఓసాకా సైతం ‘గెలుపు’పై నమ్మకంతో ఉంది. ఓటమి తెలీకుండా యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరడంపై మాట్లాడుతూ ‘ఎవరితో ఆడుతున్నానన్నది పెద్దగా పట్టించుకోలేదు. ఫైనల్ సెరెనాతో ఆడాలన్న అంశంపైనే దృష్టిపెట్టా. బహుశ ఆ వేగంతోనే ఫైనల్‌కు చేరుకుని ఉంటా’నని పేర్కొంది. సంచలనం సృష్టించనున్న ఇద్దరు స్టార్ ప్లేయర్ల సమరం కోసం ప్రపంచం ఉత్కంఠతో ఎదురు చూస్తుంది.