క్రీడాభూమి

మావూరి.. బంగరు లేడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, సెప్టెంబర్ 7: స్వర్ణ లేడిని సాదరంగా ఆహ్వానించింది గౌహతి. ఆసియా వేదికపై ఆమె పాటవానికి జేజేలు పలికింది. ఇండోనేసియాలో సంచలనం సృష్టించి ఇంటికొచ్చిన ‘్ధంగ్ (హిమ పుట్టిన ఊరు) ఎక్స్‌ప్రెస్’ను ముద్దు చేసింది. విజేతగా తిరిగివచ్చిన తనకు దక్కిన గౌరవానికి ఉద్వేగభరితమైంది స్ప్రింట్ అథ్లెట్ హిమదాస్. ఆసియా గేమ్స్‌లో స్వర్ణ, రజతాలను సాధించిన హిమదాస్‌ను చూసి గౌహతివాసులు మురిసిపోయారు. ఆనందోత్సాహాల మధ్య రాష్ట్రానికి ఆహ్వానించారు. ఆమె కోసం ఎల్‌పిజిబి ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన ట్రాక్ మోడల్ రెడ్ కార్పెట్‌పై నడిపించి ఆనందాన్ని పంచుకున్నారు. ఎయిర్ పోర్టులో దిగిన హిమదాస్‌కు అసోం సీఎం సర్భానంద సోనోవాల్, కేబినెట్ మంత్రులు స్వాగతం పలుకుతూ సంప్రదాయబద్ధంగా ‘గమోసా’ (గౌరవప్రదమైన కండువా) కప్పి అభినందించారు. విజేతగా తిరిగివచ్చిన కూతుర్ని రైతు తల్లిదండ్రులు రోన్జిత్, జోనాలిదాస్‌లు గుండెలకు హత్తుకున్నారు. 25మందితో కూడిన అసోం పోలీస్ స్పెషల్ ఉమెన్ కమాండోస్ ఆమెకు రక్షణ (బిరాన్‌గోన) వలయంగా నిలిచింది. ‘అమర్ గొరోర్ సువాలి’ (మా ఊరి పిల్ల) అంటూ విద్యార్థులు, క్రీడాభిమానులు, రాజకీయ నేతలు, ఊరి ప్రజలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. బ్లూ జీన్స్, రెడ్ జాకెట్‌లో దిగిన హిమదాస్‌ను డప్పు వాయిద్యాలు, బిహు నృత్యాల మధ్య విలాసవంతమైన కారులో పెద్దఎత్తున ఊరేగించారు. ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ ధింగ్ గ్రామ కమిటీలో హిమ కల్చరల్, స్పోర్ట్స్ కార్యదర్శి కావడంతో, యూనియన్ పెద్దఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించింది. ఊరేగింపుగా సరుసజై స్టేడియంకు వెళ్లిన హిమ, ఒక్కసారిగా కారు దిగి ట్రాక్‌ను ముద్దాడింది. ‘నేను ఇక్కడే శిక్షణ పొందాను. ఈస్థాయికి చేరడానికి ఈ మట్టే కారణం. ఇప్పటి వరకూ నేను సాధించిన విజయాలు మీరు తీర్చిదిద్దినవే. ఈ ఆనందం, ఉత్సాహం మరిన్నిసార్లు రుచి చూసేందుకు ఇంకా ఇంకా ముందుకెళ్తాను. నా పుట్టిన ఊరు ధింగ్ నుంచి ఎంతోమంది నావాళ్లు ఇక్కడికి వచ్చారు. అది నామీద వాళ్లకున్న ప్రేమ. నేను కారులో ఊరేగుతున్నా, ఎర్రటి ఎండలో వెంట నడిచిన వాళ్ల ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరువను’ అంటూ హిమ ఉద్వేగంగా మాట్లాడింది.