తెలంగాణ

పరీక్షలకు ఆటంకం లేకుండా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల సంరంభంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. డిసెంబర్ 15 నుండి జనవరి 20లోపు నాలుగు రాష్ట్రాలకు కొత్త అసెంబ్లీలు ఏర్పాటు కావల్సిన దశలో తెలంగాణ రాష్ట్రానికి సైతం ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే యోచనలో ప్రభుత్వం ఉండటంతో అందుకు అనుగుణంగా విద్యా వార్షిక ప్రణాళికలను సవరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వారం రోజుల్లో తెలంగాణలో ఎన్నికల షెడ్యూలుపై మరింత స్పష్టత రానుంది.
ఎన్నికల కమిషన్ ఒక వేళ ముందస్తుగా ఎన్నికలకు సిద్ధపడితే అదే సమయంలో విద్యా ప్రణాళికకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని అధికారులు యోచిస్తున్నారు. అక్టోబర్‌లో దసరా సెలవులు ఉన్నాయి. దసరా సెలవుల తర్వాత తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. నవంబర్ 7న దీపావళి ఉండటంతో దీపావళికి దసరాకు మధ్యలో రాష్ట్ర ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే జాతీయ ప్రవేశపరీక్షల షెడ్యూలు దాదాపు ఖరారైంది. యూజీసీ నెట్ డిసెంబర్ 9 నుండి 23 వరకూ జరుగుతుంది. జెఈఈ మెయిన్స్ 2019 జనవరి 6 నుండి 20 వరకూ జరగనుంది. జెఈఈ మెయిన్స్ 2019 ఏప్రిల్ 6 నుండి 20 వరకూ జరగనుంది. సీమ్యాట్ 2019 జనవరి 28న, జీపాట్ కూడా అదే రోజు జరుగుతాయి. ఇక నీట్ యూజీ ఎగ్జామ్ 2019 మే 5న జరుగుతుంది. ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి చివరిలో ప్రారంభించి మార్చి రెండోవారంలో ముగించాలంటే జనవరిలో ప్రాయోగిక పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుంది.
అదే విధంగా జనవరిలో రెండు కంపల్సరీ పేపర్లు పరీక్షలు జరుగుతాయి. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే సకాలంలో సిలబస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు కాలేజీల్లో ఇప్పటికే సిలబస్ పూర్తి చేసి కాలేజీల్లోరివిజన్ ప్రారంభించగా, ప్రభుత్వ కాలేజీల్లో ఇంకా సిలబస్ పూర్తికాలేదు. ప్రీ ఫైనల్ పరీక్షలు జనవరిలో నిర్వహించాలన్నా అందుకు అనుగుణంగా డిసెంబర్ నాటికి సిలబస్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. మరో పక్క ఈ ఏడాది పీజీ లాసెట్, యూజీ లాసెట్ అడ్మిషన్లు ఇంకా పూర్తికాలేదు. అవి ఎపుడు పూర్తవుతాయో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. చాలా లా కాలేజీలు ఇప్పటికే యాజమాన్య కోటా సీట్లను అమ్మేసుకోగా, ప్రభుత్వ కన్వీనర్ కోటా సీట్లు మాత్రం భర్తీ కావల్సి ఉంది. అక్టోబర్‌లో ఎన్నికలు నిర్వహించినట్టయితే ఇటు టీచర్లకు, అటు లెక్చరర్లకు వద్దన్నా ఎన్నికల విధి తప్పేలా లేదు.
ఎన్నికల నిర్వహణలో పాల్గొనే అధికారులకు, టీచర్లకు, లెక్చరర్లకు ఎలాగూ శిక్షణ తప్పదు. రాష్ట్రం మొత్తం మీద రెండు దశల్లో ఎన్నికలు జరిగే పక్షంలో అందుకు 10 నుండి 15 రోజుల పనిదినాలు దెబ్బతింటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, ఎన్నికలు ఖచ్చితంగా అక్టోబర్ చివరిలో జరిగే పక్షంలో తీసుకోవల్సిన చర్యలపై పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
పరీక్షలు, విద్యాత్మక ప్రణాళిక దెబ్బతినకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు.