తెలంగాణ

ఎవరితో కలుద్దాం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణలో శాసనసభ రద్దు కావడంతో ముందస్తు ఎన్నికల్లో ఎవరితో కలిసి పనిచేయాలనే అంశంపై జనసేన మేథోమధనం నిర్వహించింది. ఏ పార్టీలతో కలిసి పనిచేయాలనే అంశంపై ఒకటి రెండు రోజుల్లో ఏకాభిప్రాయానికి రానున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ ఏ పార్టీలతో కలిసి పనిచేస్తే వాటి ఫలితాలు ఎలా ఉంటాయనే అంశంపైనా బలాబలాపైనా భేరీజు వేసింది. శాసనసభ రద్దు కావడంతో తెలంగాణ రాజకీయ పరిణామాలపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సుదీర్ఘంగా చర్చించిందని పార్టీ ఉపాధ్యక్షుడు బి మహేందర్ రెడ్డి చెప్పారు. మాదాపూర్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో మేథోమధనం నిర్వహించామని తెలిపారు. తెలంగాణలో వివిధ రాజకీయ పక్షాలు, రాజకీయ కూటముల బలాబలాలను ప్యాక్ బేరీజు వేసిందని మహేందర్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో జనసేన అనుసరించాల్సిన వ్యూహంపై ఒక నివేదిక రూపొందించి పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌కు సమర్పించాలని కమిటీ నిర్ణయించింది. శనివారం లేదా ఆదివారం నాడు పార్టీ అధ్యక్షుడితో జరిగే సమావేశంలో పలు అంశాలను విస్తృతంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణలో జనసేనతో కలిసి పనిచేయాలని సీపీఎం అభిలాష వ్యక్తంచేయడమే గాక, పవన్‌కళ్యాణ్ పుట్టిన రోజు ఆ పార్టీ నేతలు హైదరాబాద్‌కు వచ్చి చర్చలు జరిపి వెళ్లారు. ఈ సందర్భంగా రాజకీయ వ్యవహారాల కమిటీ తమ్మినేని వీరభద్రంతో చర్చలు జరిపింది. సమావేశం వివరాలు, ప్యాక్ అభిప్రాయాలను పార్టీ అధ్యక్షుడికి సమర్పించామని మహేందర్‌రెడ్డి తెలిపారు.