రాష్ట్రీయం

కరవును తరిమేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 7: రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులను అధిగమిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆరు జిల్లాల్లోని 296 మండలాల్లో కరవు మేఘాలు అలముకున్నా సమర్థ నీటి నిర్వహణ విధానాల వల్ల క్షామ పరిస్థితులను ఎదుర్కోగలిగామన్నారు. రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 296 మండలాలను కరవుప్రాంతాలుగా గుర్తించినట్లు చెప్పారు. రెయిన్‌గన్‌ల ద్వారా 22వేల హెక్టార్లు, జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం ద్వారా మరో 3వేల హెక్టార్లు, ఇతరత్ర చర్యలతో మొత్తం 34వేల హెక్టార్లలో పంటలను కాపాడామన్నారు. ఉపాధి హామీ పనులకు కొదవ లేదన్నారు. ఎంతమందికి ఎన్ని పనిదినాలైనా కల్పిస్తామని వెల్లడించారు. పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు 40వేల ఎకరాల్లో పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 3లక్షల టన్నుల మేర అందుబాటులో ఉందన్నారు. కరవు మండలాల్లో రక్షిత మంచినీటికి ఇబ్బందిలేకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు. సీమలో 60శాతం తక్కువ వర్షపాతం నమోదయిందని, కరవు దృష్ట్యా పంటలు వేయకపోయినా కడప జిల్లాలో 3వేల 535 ఎకరాలకు సంబంధించి 5395 మంది రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద బీమా సదుపాయం కల్పించటంతో పాటు రూ 111 కోట్ల మేర నష్టపరిహారం అందించామని తెలిపారు. ఆరు జిల్లాల్లో కరవును అధిగమించేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. నాలుగేళ్లలో నీటి ఎద్దడి తలెత్తకుండా జాగ్రత్తలు పాటించటం వల్లే కరవును ఎదుర్కొనే వీలు కలిగిందని చెప్పారు. రాష్ట్రం మొత్తంగా 67లక్షల హెక్టార్లు సాగుకు అనుకూలమని, 62 శాతం మంది వ్యవసాయంపై దీనిపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ఇందులో 51 లక్షల హెక్టార్లలో వ్యవసాయ, 16 లక్షల హెక్టార్లలో ఉద్యానవన పంటలు పండిస్తున్నారని పేర్కొన్న చంద్రబాబు కోటి ఎకరాల్లో ఉద్యానవన పంటలు పండించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. జలసంరక్షణ, భూగర్భజలాల పెంపు కారణంగానే వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యవసాయంలో వృద్ధిరేటు సాధించ గలిగామన్నారు. 2016-17లో జాతీయ వృద్ధిరేటు 6.3శాతం ఉంటే రాష్ట్రంలో 14.91 శాతం ఉందని, 2017-18లో కేంద్రం 3శాతం, రాష్ట్రంలో 17.76 శాతం సాధించామన్నారు. గత మూడేళ్లుగా సగటు వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ ఆహారధాన్యాల ఉత్పత్తిలో వృద్ధి పెరిగిందన్నారు. 2016-17లో 60 లక్షల హెక్టార్లలో సాగుకు గాను 150 లక్షల మెట్రిక్ టన్నులు, గత ఏడాది 59.75 వేల హెక్టార్లకు సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ 165 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాల ఉత్తత్తి జరిగిందన్నారు. ప్రాథమిక రంగంలో కేంద్ర వృద్ధిరేటు 14.8శాతం ఉంటే ఏపీలో 29.3 శాతం ఉందని వ్యవసాయ, ప్రాథమిక రంగాల్లో జీఎస్‌డీపీ పెరుగుదల వల్లే అభివృద్ధి సాధ్యపడుతుందని వివరించారు. దేశం మొత్తంగా మొక్కజొన్న , సోయాబీస్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నామని వరిలో రెండో స్థానానికి చేరామన్నారు. భవిష్యత్తులో అన్ని పంటల్లో నెంబర్‌వన్ స్థానాన్ని చేరుకోవటంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కేంద్రబిందువుగా ఉండేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించామన్నారు. నదుల అనుసంధానం, వ్యవసాయంలో యాంత్రికీకరణ, వర్షపునీటిని భూగర్భజలాలుగా మార్చటం, సాగునీటికి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా కరవును అధిగమించగలమనే ఆత్మస్థయిర్యం కలుగుతోందని చెప్పారు. అధునాతన సాంకేతిక పద్దతులను అనుసరించడం ద్వారా సాగు విస్తీర్ణం పెంచే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా జీబా టెక్నాలజీని ప్రయోగాత్మకంగా ఐదువేల హెక్టార్లలో ఎకరానికి రూ 3వేల ఖర్చుతో అమలు చేస్తున్నామని మరోవైపు ఐదులక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేపట్టామన్నారు. వ్యవసాయంపై ఖర్చులు తగ్గిస్తామన్నారు. ప్రకృతి సేద్యంపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి ఆహ్వానించినట్లు చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రంలో 15 శాతం వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ రెండు మీటర్ల మేర భూగర్భజలాలు పెరిగాయన్నారు. ఇప్పటి వరకు 39 లక్షల 53 హెక్టార్లకు గాను 31.46 హెక్టార్లలో సాగుచేయటం ద్వారా 83.13 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగిందని వివరించారు. ఉద్యావన పంటలను పూర్తిస్థాయిలో కాపడతామని హామీ ఇచ్చారు. రియల్‌టైమ్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా పంటల పరిస్థితిని గుర్తించి అవసరమైన సూచనలిస్తున్నామని, కరవు మండలాల్లో 20వేల 900 హెక్టార్లలో పంటలు కాపాడే వీలు కలిగిందన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణాకు తరలించడం ద్వారా శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో నీటి నిల్వ సాధ్యపడిందన్నారు. శ్రీశైలం నుండి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరందించటంతో పాటు రెయిన్‌గన్లను ఉపయోగించటం వల్ల కొంత వరకు ఉపశమనం కలిగిందని తెలిపారు. వాసార్ ల్యాబ్, ఇక్రిసాట్ పంటల విశే్లషణ జరపటంతో పాటు మూడు నెలలకోసారి సమీక్ష నిర్వహించటం వల్ల కరవును నియంత్రించ గలుగుతున్నామని చెప్పారు. కరవు మండలాల్లో నూరు శాతం సబ్సిడీతో విత్తనాలు రైతులకు అందిస్తున్నామని, వాతావరణ పరిస్థితుల కనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల దిశగా జాగృతం చేస్తున్నామని వివరించారు.