రాష్ట్రీయం

టార్గెట్ మోదీ, కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 7: తెలంగాణలో ముందస్తు వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ సిద్ధం చేసుకుంటోంది. ప్రధానంగా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కలిసొచ్చే పార్టీలతో పొత్తులపై కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో టీటీడీపీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి..టీటీడీపీ నేత రమణ ద్వారా ముఖ్యమంత్రికి రాయబారం పంపినట్లు సమాచారం. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, మారనున్న సమీకరణలపై శుక్రవారం రాత్రి పార్టీ అధినేత చంద్రబాబు సచివాలయంలో మంత్రులు, పార్టీ నేతలతో ఆంతరంగిక సమావేశం నిర్వహించారు. ప్రధానంగా మోదీని, కేసీఆర్‌ను టార్గెట్ చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో పార్టీని సమాయత్తం చేస్తూనే ఎప్పటికప్పుడు పరిణామాలను నిశతంగా గమనించాలని టీటీడీపీ నేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం ముందస్తు ఎన్నికలతో బహిర్గతమైందని కొందరు నేతలు వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీల ఐక్యత కోసం కేసీఆర్ చేసిన హడావుడి బీజేపీ కోసమే అనే అనుమానాన్ని ఓ మంత్రి వ్యక్తపరిచారు. బీజేపీ సూచనల మేరకే కర్ణాటకలో జేడీఎస్‌తో కేసీఆర్ మంతనాలు జరిపారని సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల సీఎంలు కలసి పనిచేయాలనే కొందరి సూచనను కేసీఆర్ తిరస్కరించటం ఇందులో భాగమే అని మరో నేత వ్యాఖ్యానించారు. అప్పటికే బీజేపీతో కేసీఆర్ ఒక అవగాహనకు వచ్చారనే సందేహాన్ని పలువురు నేతలు వెలిబుచ్చారు. కేసీఆర్ వ్యూహమంతా కేంద్రం రచించిన పథకమే అనే నిర్ణయానికి వచ్చారు. కాగా తెలంగాణలో పొత్తుల అంశంపై శనివారం తుది నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. పొత్తులు ఖరారైన అనంతరం పార్టీనేతలకు బాధ్యతలు అప్పగించి వరుస సమావేశాలు నిర్వహించడం ద్వారా క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు.