రాష్ట్రీయం

తెలంగాణలో టీడీపీకి బలమైన పట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 7: తెలంగాణలో ఇప్పటికీ టీడీపీ బలమైన శక్తిగానే ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న సమయంలో శుక్రవారం మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో తెలంగాణలోని రాజకీయ పరిస్థితులను లోకేష్ ప్రస్తావించారు. ఓ పక్క తెలుగువారంతా కలిసుండాలంటూనే మరో పక్క జాగో బాగో అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ప్రస్తుత టీఆర్‌ఎస్ పార్టీలో టీడీపీ వాళ్లెంత మంది ఉన్నారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసునన్నారు. ఆంధ్రావాళ్ల ఓట్లు వేయించుకుని గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ పక్కన కూర్చోబెట్టుకోలేదా అని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆంధ్రావాళ్లు ఓట్లు వేస్తేనే టీఆర్‌ఎస్ గెలించిందన్నారు. తెలంగాణలో టీడీపీ ఇప్పటికీ బలీయమైన శక్తిగానే ఉందన్నారు. ఎన్నికల్లో టీడీపీనే క్రీయాశీల పాత్ర పోషించనుందని అభిప్రాయపడ్డారు. ఇలాఉంటే మంత్రి లోకేష్ తన ఛాంబర్‌లో మంత్రి కిమిడి కళావెంకట్రావుతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే ఈ నెలలోనే ప్రారంభించనున్న యువశక్తి పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.