ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, సెప్టెంబర్ 7: కర్నూలు జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రోడ్డు వారగా నిలుచున్న ఆటోను లారీ ఢీకొనడంతో కడప జిల్లాకు చెందిన షేక్ హాజీపీరా(45), షేక్ రజాక్(60) అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. కడప జిల్లా కమలాపురానికి చెందిన వీరు కర్నూలులో జరిగిన పెళ్లికి హాజరై శుక్రవారం తిరిగి వెళ్తుండగా ఆళ్లగడ్డ సమీపంలో ప్రమాదం జరిగింది. హాజీపీరా, రజాక్ మృతి చెందగా ఆర్మూర్, షేక్ అహ్మద్, షేక్ అబ్దుల్ ఖాదర్ గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నేడు వైసీపీలోకి నేదురుమల్లి కుమారుడు
విశాఖపట్నం, సెప్టెంబర్ 7: మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి కుమారుడు రామ్‌కుమార్ శనివారం వైసీపీలో చేరనున్నారు. ప్రస్తుతం విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్ర శనివారం విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోకి అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా నరవ గ్రామానికి జగన్ పాదయాత్ర చేరుకునే సమయంలో రామ్‌కుమార్ జగన్‌ను కలిసి పార్టీలో చేరనున్నారు. రామ్‌కుమార్ చిత్తూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిత్యం వహిస్తున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రామ్‌కుమార్ పరాజయం పాలయ్యారు. రామ్‌కుమార్ తన అనుచరులతో ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు.