అంతర్జాతీయం

సీటీబీటీపై తక్షణం సంతకాలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాస: అమెరికా, భారత్‌తో సహా ఎనిమిది దేశాలు వీలైనంత త్వరగా సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందాన్ని (సీటీబీటీ) ఆమోదించేందుకు చర్యలు తీసుకోవాలని ఐరాస చీఫ్ ఆంటోనియో గాటెర్రెస్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో తాత్సారం చేస్తే ప్రపంచ శాంతి, ప్రపంచ దేశాలను అణ్వస్త్ర రహితంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి విఘాతం కలుగుతుందన్నారు. సీటీబీటీ ఒప్పందంపై ప్రపంచంలో 180 దేశాలు సంతకాలు చేశాయన్నారు. అణ్వస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఎనిమిది దేశాలు ఆమోదిస్తేనే సీటీబీటీ అమలులోకి వస్తుందన్నారు. చైనా, ఈజిప్టు, ఇండియా, ఇరాన్, ఇజ్రాయేల్, ఉత్తర కొరియా, పాకిస్తాన్, అమెరికా దేశాలు సీటీబీటీని ఆమోదించలేదన్నారు. ఈ ఒప్పందం అమలు కోసం గత 20 ఏళ్లుగా చర్చలు సాగుతున్నాయన్నారు. అంతర్జాతీయంగా పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలన్న ఐరాస లక్ష్యాలు అమలుకునోచుకోవడం లేదన్నారు. ప్రతి దేశం సీటీబీటీ అమలుకోసం చిత్తశుద్ధితో సహకరించాలన్నారు. ఇతర దేశాలు ఆమోదించిన తర్వాత సంతకాలు చేయవచ్చన్న ఆలోచన మంచిదికాదన్నారు. అణ్వస్త్ర పరీక్షలు, ప్రయోగాల వల్ల పర్యావరణం, ప్రజారోగ్యం, ఆహార భద్రత, ఆర్థికాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం రోజుల తర్వాత చాలా దేశాలు స్వచ్ఛందంగా అణ్వస్త్ర ఆయుధాలను త్యజించాయని ఆయన గుర్తుచేశారు. జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు మిరోస్లేవ్ లజ్‌కాక్ మాట్లాడుతూ, అణ్వస్త్ర పరీక్షల వల్ల ప్రపంచ దేశాల్లో ఉద్రిక్తతలు పెరగడం మినహా మరో ఉపయోగం లేదన్నారు. సీటీబీటీ అమలు కల సాకారం కావాలన్నారు. వీలైనంత త్వరలో సీటీబీటీ ఒప్పందంపై ఎనిమిది దేశాలు సంతకాలు చేసే విధంగా వత్తిడి తేవాలన్నారు. మానవాళికి హాని కలిగించే అణ్వస్త్రాలను త్యజించడం వల్ల అభివృద్ధి ఊపందుకుంటుందన్నారు.