జాతీయ వార్తలు

‘ఆయుష్మాన్ భారత్’ భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: దేశ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకం అద్భుతమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రాస్ గెబ్రియోసిస్ కితాబునిచ్చారు. ఇలాంటి పథకాల ద్వారా అట్టడుగు వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ట్వీట్ చేశారు. ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టిన మోదీని ప్రశంసించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వర్గాలు (బీపీఎల్) ఈ పథకం ద్వారా ఐదు లక్షల వరకూ వైద్య బీమాను పొందవచ్చు. బీమా సొమ్మును కేంద్రమే భరిస్తుంది. దేశవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా. కాగా, ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమాల జాబితాలో చేరిన ‘ఆయుష్మాన్’ను అత్యుత్తమ పథకంగా గెబ్రియోసిస్ ప్రశంసించారు. ఇలావుంటే, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ గెబ్రియోసిస్‌ను ఇటీవల కలిసి ‘ఆయుష్మాన్’ గురించి వివరించారు. అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో కలిపితే ఎంతమంది ఉంటారో, భారత్‌లో అంతమంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని నడ్డా వ్యాఖ్యానించారు.