రాష్ట్రీయం

అన్నప్రసాద విరాళాలు వెయ్య కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్న ప్రసాద వితరణకు సంబంధించి భక్తులు ఇస్తున్న విరాళాలతో ఈనెల 6వ తేదీ నాటికి రూ. 1000 కోట్లునిధులు చేరినట్లు టీటీడీ ఈఓ ఎకె సింఘాల్ చెప్పారు. డయల్ యువర్ ఈఓ కార్యక్రమం సందర్భంగా టీటీడీ చేపడుతున్న అభివృద్ధి, భక్తులకు అందిస్తున్న సౌకర్యాల గురించి ముందస్తుగా వివరించారు. 1952 తిరువాభరణం రిజిస్టర్‌లో నమోదైన ఆభరణాలు భద్రంగా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం పంపిన రెండు కమిటీలు రిజిస్టర్లు పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించాయన్నారు. ఈనెల 13 నుంచి 21 వరకు శ్రీవారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని, అక్టోబర్ 10 నుంచి 18 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాన్నారు. ఎస్వీ భక్తిచానల్ ద్వారా అన్ని వాహన సేవల ఊరేగింపు ప్రత్యక్ష ప్రసారం ఉంటుందన్నారు. 2019 టీటీడీ డైయిరీలను, క్యాలెండర్లను సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆవిష్కరిస్తామన్నారు. ఈనెల 17వ తేదీన గరుడ వాహనానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించడానికి ఈనెల 13న సిఎం చంద్రబాబు తిరుమలకు వస్తారన్నారు. సెప్టెంబర్ 14 నుంచి భక్తులు డైయిరీలను ఆన్‌లైన్లో బుక్ చేసుకోవచ్చని అన్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, రాత్రి 8 నుంచి 11 గంటల వరకు వాహన సేవలను నిర్వహిస్తామన్నారు. గరుడ సేవను రాత్రి 7గంటలకే ప్రారంభిస్తామని చెప్పారు. కాగా రూ. 98 కోట్ల వ్యయంతో శ్రీవారి సేవా సదన్‌ను పూర్తి చేశామని, బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈభవనాన్ని ప్రారంభిస్తామన్నారు. మహిళలు, పురుషు శ్రీవారి సేవకులకు వేర్వేరుగా సౌకర్యాలు కల్పించామని ఈ ఓ తెలియజేశారు.