Others

నువ్వు నేను (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చిత్రం’గా మొదలైన తన కెరీర్ వరుస హిట్లతో అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. శాశ్వతంగా దూరమైనా అభిమానుల హృదయాల్లో ఇంకా బతికే ఉన్నాడు హీరో ఉదయ్‌కిరణ్. ఆయన నటించిన హిట్ చిత్రాల్లో రెండవ చిత్రం ‘నువ్వు నేను’. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన ప్రేమకథా చిత్రాలను మనం తెరపై చూసి ఉంటాం. ఈ సినిమా సూపర్ అనేది కథలోను, నటనలోను, డైరెక్షన్ మొదలైన వాటినిబట్టి మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ‘నువ్వు నేను’. ఇది చాలామంచి ప్రేమకథా చిత్రం. ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనిపించే చిత్రం. కోటీశ్వరుడైన ఉదయ్‌కిరణ్ మధ్యతరగతి అమ్మాయి అనితతో ప్రేమలో పడతాడు. కాలేజీలో గొడవలతో మొదలైన వీరి పరిచయం ప్రేమకు దారితీస్తుంది. వీరిద్దరు ప్రేమించుకున్నా ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోరు. తండ్రి ఎన్ని సంబంధాలు చూసినా, ‘నేను ప్రేమించిన అమ్మాయిని తప్ప ఏ అమ్మాయిని పెళ్ళిచేసుకోను’అని ఉదయ్‌కిరణ్. మా బడ్జెట్‌కి తగ్గ అమ్మాయి కావాలని ఉదయ్‌కిరణ్ తండ్రి, ‘ప్రేమంటేనే మాకు అసహ్యం’అని హీరోయిన్ అనిత తండ్రి (తనికెళ్ళ భరణి), అత్త (తెలంగాణ శకుంతల) వీరిద్దరిని విడదీయడానికి ఎన్నోరకాలుగా అడ్డుపడతారు. అయినా ఆ అడ్డుల్ని తొలగించుకుని వాళ్ళ ప్రేమను గెలిపించుకుంటారు. కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ల ప్రేమను అర్ధంచేసుకుని అందరు ఏకమై వాళ్ల పెళ్లి జరిపిస్తారు. ఇంతమంది వీళ్ల ప్రేమను అర్ధంచేసుకున్నా హీరో తండ్రి అర్ధం చేసుకోడు. చివరికి హీరోయిన్ తండ్రి (తనికెళ్ళ భరణి) అర్ధంచేసుకుని పెళ్ళికి పెద్దవారయ్యారు. ఈ సినిమాను చూస్తేచాలు ‘ప్రేమ చాలా గొప్పది’ అని మనం తెలుసుకోవచ్చు. డైరెక్టర్ తేజ ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. ఆర్పీపట్నాయక్ సంగీతం చాలా బాగుంది.

- రత్నావత్ పంచారామ్, ఊట్‌పల్లి, నిజామాబాద్ జిల్లా