Others

‘మాతృదేవోభవ అన్న సూక్తిని మరిచాను..’ (. నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సంస్కృతికి అద్దంపడుతూ చక్కని సందేశంతో సాగిన పాట ఇది. ‘మాతృదేవోభవ’అన్న సూక్తి మరిచాను..అంటూ ఉద్వేగంగా ప్రారంభమయ్యే ఈ పాట ‘పాండురంగడు’ చిత్రంలోని గంభీర రసాస్పద భావనల సమాహారం. జన్మనిచ్చిన అమ్మ, ఆపదలో అండగా నిలిచే నాన్న ప్రత్యక్ష దైవాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి. అమ్మనాన్న చెప్పిన మాటల్ని విధిగా వినాల్సిందిపోయి పెడచెవిన పెడితే కఠిన సమస్యలకుగురై కడకు పశ్చాత్తాపపడాల్సి వస్తుందని తెలిపే జీవన సత్యం ఈ పాటకు ప్రాణం. ‘నీ నెత్తుటి ముద్దయేనా అందమైన దేహము’ - ‘బిడ్డ బతుకు దీపానికి తల్లిపాలే చమురు’అని- అంటూ గేయకర్త సుద్దాల అశోక్‌తేజ మొదటి చరణంలో అమ్మ విశిష్టతని, రెండవ చరణంలో నాన్న ప్రత్యేకతని చక్కటి తెలుగు పదాలతో లయాత్మకంగా వాడి పాటకు ఒరవడిదిద్దారు. అలాగే ఎం.ఎం.కీరవాణి స్వరాలు కథానాయకుని ఆవేదన. హృదయ నివేదన భావాలతో కలగలసి పాటకు ఇంపును, వేగాన్ని అందించి ఆకట్టుకున్నాయి. ప్రతి చరణంలోనూ పశ్చాత్తాపం ప్రతిధ్వనిస్తూ హృదయాల్ని ద్రవింపజేస్తుంది. మళ్లీమళ్లీ వినాలనిపిస్తుంది. అమ్మ నాన్నలకు సముచిత స్థానమిచ్చి, గౌరవించే మన సంస్కృతి ఉన్నంతవరకు ఈ పాట ప్రజల్లో నిలిచే ఉంటుంది. కుటుంబ బాంధవ్యాలు అనుబంధాలు జీవన సౌఖ్యాలని తెలిపే ఈ పాట ‘మాతృ దేవోభవ’అంటూ మనల్ని మేల్కొలుపుతూనే ఉంటుంది.

- కొండూరు వెంకటేశ్వరరాజు, గూడూరు, నెల్లూరు జిల్లా