అంతర్జాతీయం

ఆధిపత్యం హిందూతత్వం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికాగో, సెప్టెంబర్ 8: ఆధిపత్యం చెలాయించడం, పెత్తనం చేయడం హిందూ తత్వం కాదని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన రెండవ ప్రపంచ హిందూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. 1893లో స్వామి వివేకానంద చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సమ్మేళనంలో పాల్గొని, చారిత్రక ఉపన్యాసం చేశారు. ఆ సభ జరిగి 125 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సుకు వివిధ కులాలకు చెందిన 2,500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వారిని ఉద్దేశించి భగవత్ మాట్లాడుతూ, ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడం హిందూ వౌలిక సూత్రాలకు విరుద్ధమన్నారు. అన్ని కులాలు, జాతులు ఒకటిగా కలిసి, హిందూ ఐక్యతను చాటాలన్నారు. ఇది ఇతరులపై ఆధికారానాన్ని చెలాయించడానికి కాదని వివరించారు. ఒంటరిగా ఉంటే సింహంపైన కూడా అడవి కుక్కలు దాడి చేసి చంపుతాయని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని మరచిపోకూడదని అన్నారు. మెరుగైన ప్రపంచాన్ని కోరుతున్నామని, వసుధైక కుటుంబమే హిందువుల నినాదమని అన్నారు. సంప్రదాయాలను పాటించడం అవసరమని అన్నారు. అయితే తాను ఆధునీకరణకు వ్యతిరేకిని కానని స్పష్టం చేశారు. హిందూ ధర్మం అత్యంత సనాతనమైనదేకాకుండా, అత్యంత ఆధునికమైనదని వ్యాఖ్యానించారు. ‘సుమంత్రితే సువిక్రంతే’ (సమష్టిగా ఆలోచించు.. గొప్ప విజయాన్ని సాధించు) అనేదే సూత్రం ఆధారంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ విధానమే యావత్ ప్రపంచాన్ని ఒకటి చేస్తుందని భగవత్ అన్నారు. అహాన్ని అదుపు చేసుకొని, అందరి అభిప్రాయాలనూ గౌరవించడం నేర్చుకుంటే వసుధైక కుటుంబ సాధ్యమవుతుందని తెలిపారు. కృష్ణ భవగవానుడు, ధర్మరాజు పరస్పరం ఎప్పుడూ విభేదించుకోలేదని గుర్తుచేశారు. రాజకీయాలకు, యుద్ధనీతికి ప్రతీకగా మహాభారతం నిలుస్తుందని చెప్పారు. రాజకీయాలను ధ్యానంలా చేయకూడదని భగవత్ వ్యాఖ్యానించారు. హిందూ సమాజంలో అసాధారణ ప్రతిభాపాటవాలున్న వారి సంఖ్య చాలా ఎక్కువని అన్నారు. అయితే, వీరంతా ఒకేతాటిపైకి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ ఏకమైతే, పరిస్థితి మరో విధంగా ఉంటుందన్నారు. మూల సూత్రాలను మరచిపోతున్నందువల్లే హిందూ జాతి కొన్ని శతాబ్దాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నదని భవగత్ గుర్తుచేశారు. హిందువుల ఐక్యత తక్షణ కర్తవ్యమని తెలిపారు.
చిత్రం..చికాగోలో జరిగిన ప్రపంచ హిందూ సదస్సులో ప్రసంగిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్