అంతర్జాతీయం

నేపాల్‌లో కూలిన హెలికాప్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు, సెప్టెంబర్ 8: ఏడుగురు ప్రయాణిస్తున్న ఓ హెలికాప్టర్ శనివారం నేపాల్‌లో కుప్పకూలింది. ఈ సంఘటనలో ఒక విదేశీయుడుసహా ఆరుగురు మృతి చెందారు. అత్యంత ఆశ్చర్యకరంగా ఓ మహిళ ప్రాణాలతో బయటపడింది. ఆల్టిట్యూట్ ఎయిర్ సంస్థకు చెందిన ఈ హెలికాప్టర్ శనివారం ఉదయం గోర్ఖాలోని సమాగున్ నుంచి బయలుదేరింది. అయితే, 32 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఖాట్మండు టవర్‌తో సిగ్నల్స్ కోల్పోయింది. రెస్క్యూ అధికారులు వెంటనే రంగంలోకి దిగి, జాడ లేకుండా పోయిన హెలికాప్టర్‌ను వెతకడం ప్రారంభించారు. మధ్యాహ్నాకి ధాండింగ్, నువాకోట్ జిల్లాల సరిహద్దుల్లోని దట్టమైన అడవుల్లో అది కూలిపోయినట్టు కనుగొన్నారు. పైలట్ కేసీ నిశ్చల్‌సహా ఆరుగురు సంఘటన స్థలంలోనే మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. వీరిలో జపాన్‌కు చెందిన ట్రెకర్ హిరోమీ కొమాత్సు కూడా ఉన్నట్టు తెలిపారు. కొద్దిపాటి గాయాలతో బయటపడిన మహిళను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణమే ఈ దుర్ఘటనకు కారణంగా అనుమానిస్తున్నారు. విచారణ ప్రారంభమైందని, నివేదిక అందిన తర్వాత వివరాలు తెలుస్తాయని అల్టిట్యూట్ ఎయిర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నిమా నురూ షెర్పా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.