రాష్ట్రీయం

వారిని చేర్చుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: కొండా దంపతులను పార్టీలో చేర్చుకోవద్దు, మళ్ళీ వారికి రాజకీయ ‘జీవం’ పోయవద్దని ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పలువురు ముఖ్య నాయకులు శనివారం హైదరాబాద్‌కు వచ్చి పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని, ఇతర పెద్దలను కలిసి కొండా దంపతులను చేర్చుకోరాదని కోరారు. వారిని చేర్చుకుంటే పార్టీకి భారీగా నష్టం వాటిల్లుతుందని
చెప్పారు. కొండా కుటుంబం అరాచకాలతో జిల్లా ప్రజలు బేజారెత్తారని వారు వివరించారు. వారి చేష్టలకు బాధలు అనుభవించిన అనేక మంది బాధితులు తమను కలిసి కాంగ్రెస్‌లో చేరకుండా చూసుకోవాలని కోరారని తెలిపారు. కొండా దంపతులను చేర్చుకోవడం వల్ల జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందన్నారు. లోగడ వైఎస్ రాజశేఖర రెడ్డి ‘హవా’తో గెలుపొందారని, ఆ తర్వాత గులాబీ గూటికి చేరి విజయం సాధించారని వారు వివరించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత కాంగ్రెస్‌ను తూర్పారపట్టిన కొండా దంపతులు ఇప్పుడు తిరిగి వస్తామంటే చేర్చుకోవడం భావ్యం కాదన్నారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు చేయించుకున్న వివిధ సర్వేల్లోనూ కొండా దంపతులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, అందుకే టిక్కెట్లు ఇచ్చేందుకు నిరాకరించిన విషయాన్ని గమనించాలని వారు కోరారు. పరకాల, వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలను కోరుతున్నారని, వారే కాకుండా కుమార్తెనూ ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనుకుంటున్నారని వారు నాయకత్వానికి చెప్పారు. కొండా దంపతుల పట్ల ప్రజల్లో బ్రహ్మండమైన పలుకుబడి, మంచి పేరు ఉన్నట్లయితే, తామే వెంట తీసుకుని వచ్చి చేర్పించేవాళ్ళం కదా! అని ఆ ముఖ్య నాయకులు పార్టీ నాయకత్వానికి చెప్పినట్లు తెలిసింది.