రాష్ట్రీయం

పెట్రో ధరలు పెంచడమే కేసీఆర్ సాధించిన ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా పెంచి ప్రజలను, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల విధానాలకు నిరసనగా ఈనెల 10వ తేదీన భారత్ బంద్ పాటించాలని వారు ప్రజలకు పిలుపు ఇచ్చారు. శనివారం గాంధీ భవనంలో బట్టితో పాటు డికె అరుణ, చిత్తరంజన్ దాస్, కె లక్ష్మారెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ పెరగడంతో నిత్యావసర సరుకులు రేట్లు పెరగడంతో వాటి ప్రభావం సామాన్యులపై పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం సూచనల మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ నడుచుకోవడంతో ఇంధన ధరలను భారీగా పెంచి ప్రజలపై భారాన్ని మోపుతున్నారని ఆయన విమర్శించారు.
బంద్‌కు జనసేన మద్దతు
ఈ నెల 10వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న హర్తాళ్‌కు జనసేన మద్దతు ప్రకటిస్తోందని ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. హర్తాళ్‌లో పాల్గొనాల్సిందిగా ఏపీ సీపీఎం కార్యదర్శి మధు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించినట్టు ఆయన చెప్పారు.
హర్తాళ్‌ను జయప్రదం చేయండి
వామపక్ష పార్టీలు ఈ నెల 10వ తేదీన తలపెట్టిన హర్తాళ్‌ను జయప్రదం చేయాలని వామపక్షాలు పిలుపు ఇచ్చాయి. శనివారం ముఖ్దూం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధులతో వామపక్ష పార్టీల నేతలు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నడూలేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా పెరిగిపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బడా వ్యాపారుల కంపెనీలకు 4 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీలు, బోఫోర్సును మించిన రాఫెల్ యుద్ద విమానాల కుంభకోణాల్లో కేంద్రం నిండామునిగిపోయిందన్నారు. ఆదివారం నాడు ముఖ్దూం భవనం నుంచి మోటార్ సైకిళ్ళపై నిరసన ప్రచారం చేస్తామని, 10న బస్‌భవనం నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వరకు నిరసన వ్యక్తం చేస్తున్నామని వారు చెప్పారు. సమావేశంలో సిపిఐ డాక్టర్ సుధాకర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. సిపిఎం డిజి నరసింగరావు, సిపిఐ బాలమల్లేష్, ఆర్‌ఎస్‌పి జానకీరాం, ఎస్‌యుసిఐ(సి) మురహరి పాల్గొన్నారు.