జాతీయ వార్తలు

అరెస్టయిన సానుభూతిపరులకు నిషేధిత సంఘాలతో సంబంధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 8: ఇటీవల అరెస్టయిన మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఏడు అనుబంధ సంస్థలకు సంబంధించిన వారని పూణే పోలీసులు చెప్పారు. నిషేధిత మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాల పేరుతో వీరు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పోలీసులు చెప్పారు. గత ఏడాది రాష్ట్రంలో జరిగిన ఎల్గార్ పరిషత్ సమావేశంతో మావోయిస్టు పార్టీకి సంబంధం ఉందన్నారు. ఇటీవల మహారాష్ట్ర పోలీసులు మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణపై పది మంది సానుభూతిపరులను అరెస్టు చేసిన విషయం విదితమే. అరెస్టయిన సానుభూతిపరులు మావోయిస్టు పార్టీకి చెందిన ఏడు అనుబంధ సంఘాలకు చెందిన వారని పోలీసు వర్గాలు చెప్పాయి. ఈ సంఘాలను 2009లోనే నిషేధించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా 2009 జూన్ 22వ తేదీన కేంద్రం జారీ చేసిన గెజిట్‌ను జాయింట్ పోలీస ఉకమిషనర్ శివాజీరావుబోద్కే విలేఖర్ల సమావేశంలో విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘంగా ఉన్న రెవల్యూషనరీ డెమాక్రటిక్ ఫ్రంట్‌ను తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నిషేధించాయి. ఈ సంస్థతో అరెస్టయిన తెలుగు కవి వరవరరావుకు సంబంధాలున్నాయన్నారు. అరెస్టయిన గౌతమ్ నవలక పీపుల్స్ యూనియన్ ఫర్ డెమాక్రటిక్ రైట్స్ (పీయూడీఆర్) చెందినవారని, సుధా భరద్వాజ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ సంస్థలో ఉన్నారని పోలీసులు చెపద్పారు.
రోనా విల్సన్ అనే కార్యకర్త కమిటీ ఫర్ ది రీలీజ్ ఆప్ పొలిటకల్ ప్రిజనర్స్‌కు చెందిన వారని, షోమాసేన్ అనే కార్యకర్త కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఫర్ డెమాక్రటిక్ రైట్స్, సుధీర్ ధావలే అనే కార్యకర్త రిపబ్లికన్ పాంథర్స్‌కు, మహేష్ రాట్ అనే కార్యకర్త విస్తాపన్ విరోధి జన్ వికాస్ ఆందోళన్, వెర్నాన్ గోన్‌స్లేవ్స్, అరుణ్ ఫెర్రియారా అనే కార్యకర్తలు మహారాష్ట్ర స్టేట్ కమిటీ ఆఫ్ ది సీపీఐ మావోయిస్టుకు చెందిన వారని పోలీసులు చెప్పారు.