రాష్ట్రీయం

చర్చిద్దాం రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటీరియం రిలీఫ్ (ఐఆర్) ఇచ్చే అంశంపై ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో ప్రభుత్వం రెండు మూడురోజుల్లో చర్చలు జరపాలని నిర్ణయించినట్టు తెలిసింది. దాంతో శనివారం జరగాల్సిన జేఏసి సమావేశం రద్దయిందని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు ఐఆర్ ప్రకటించకుండానే ఎన్నికలు వెళుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల జేఏసీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. శనివారం జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను పకటించాలని భావించారు. ఈ విషయం తెలిసిన కేసీఆర్ వెంటనే స్పందించారని, ఐఆర్‌పై నిర్ణయం తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారని తెలిసింది. అందుకే శనివారం జరగాల్సిన ఉద్యోగులు, టీచర్లు, కార్మికుల సంఘాల జేఏసీ కీలక సమావేశం రద్దయినట్టు తెలిసింది. అయితే శనివారం సెలవు కావడం వల్ల సాంకేతిక కారణాల మూలంగా ఈ సమావేశం వాయిదాపడ్డదని జేఏసీ సెక్రటరీ-జనరల్ మమత తెలిపారు. శనివారం సాయంత్రం ఆమె ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, సాంకేతిక కారణాల మూలంగానే జేఏసీ సమావేశం వాయిదాపడ్డదని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల జేఏసీ తదుపరి సమావేశం ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని జేఏసీ కో-చైర్మన్ మఠం శివశంకర్ తెలిపారు. శనివారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ శనివారం జరగాల్సిన జేఏసీ సమావేశాన్ని వాయిదా వేశామని వివరించారు.