రాష్ట్రీయం

దుర్గగుడిలో పాము కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) సెప్టెంబర్ 8: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారి సన్నిధిలో శనివారం పాము కలకలం రేపింది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అమ్మవారి ముఖమండప దర్శనానికి వెళుతున్న భక్తుడొకరికి పాము కనిపించటంతో అతడు గట్టిగా కేకలు వేశాడు. దీంతో భక్తులందరూ భయంతో పరుగులు తీశారు. ఈ కారణంగా సుమారు రెండు గంటల పాటు దర్శనాలు నిలిపివేశారు. సమాచారం తెలుసుకున్న ఈవో కోటేశ్వరమ్మ ఆదేశాల మేరకు ఆలయ సిబ్బంది ఆ ప్రదేశానికి చేరుకుని పాము కోసం గాలించారు. భక్తుడు పాము కనిపించిందని చెప్పిన ప్రదేశంలో పలుగులతో బండరాళ్లను పెకలించి, లోపలకి గొట్టాలతో నీరు వేగంగా పంప్ చేశారు. అయినా పాము కనిపించలేదు. ఈ హడావుడిలో పాము ఎటో వెళ్లిపోయి ఉంటుందని భక్తులు భావిస్తుండగా, ఆలయంలో వెండి నంది వద్ద ఉన్న చిన్న కలుగులోకి వెళ్లి ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. అయితే అసలు పాము రాలేదని, భక్తుడు ఏదో చూసి పాముగా భ్రమించినట్టు ఆలయ సిబ్బంది అంటున్నారు. ఈ హడావుడితో దాదాపు రెండుగంటల పాటు రూ. 300, 100, తదితర టిక్కెట్ల అమ్మకాలను నిలిపేశారు.

చిత్రం..పాము కోసం గాలిస్తున్న దుర్గగుడి సిబ్బంది