రాష్ట్రీయం

చైనా పర్యాటకుల ఆకర్షణే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 8: చైనా పర్యాటకులను ఆకర్షించడం ద్వారా భారత పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుందని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ సత్యజిత్ రాజన్ అభిప్రాయపడ్డారు. విశాఖలో మూడు రోజులుగా జరుగుతున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీవో) 34వ కనె్వన్షన్ ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకానికి చైనా అతిపెద్ద మార్కెట్‌గా పేర్కొన్నారు. చైనా పర్యాటకులను ఆకర్షించడం ద్వారా భారత పర్యాటక రంగం కొత్త ఒరవడి సంతరించుకోగలుగుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గతేడాది 144 మిలియన్ చైనా పర్యాటకులు ప్రపంచాన్ని చుట్టి వచ్చారన్నారు. వీరిలో భారత్ సందర్శనకు వచ్చింది కేవలం 2.4 లక్షలు మాత్రమేనన్నారు. వచ్చే ఐదేళ్లలో 5 శాతం చైనా పర్యాటకుల ఆకర్షణ లక్ష్యంగా పనిచేయాలన్నారు. భారత్‌లో పర్యాటక ప్రాంతాలు, దర్శనీయ స్థలాలను చైనా భాషలో ప్రచారం చేయాలన్నారు. చైనా భాష తెలిసిన టూర్ ఆపరేటర్లను ప్రచారం కోసం వినియోగించాలన్నారు.
ఇక పర్యాటకంగా భారత్‌లో ఎన్నో వింతలు ఉన్నాయని, అటవీ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా విదేశీ పర్యాటకులను ఆకర్షించ వచ్చన్నారు. ఐతే మన దేశంలో అటవీ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అటవీ చట్టాలు తీవ్ర అవరోధంగా ఉన్నాయన్నారు. పర్యాటక ప్రాజెక్టులకు అటవీ అనుమతులు రావట్లేదని, 10శాతం అటవీ అనుమతలు లభిస్తే 5 శాతం పర్యాటకుల సంఖ్య పెరుగుతుందన్నారు. ఐఏటీవో అధ్యక్షుడు ప్రణవ్ సర్కార్ మాట్లాడుతూ 20 మిలియన్ విదేశీ పర్యాటకుల ఆకర్షణ లక్ష్యంగా నిర్వహించిన 34వ కనె్వన్షన్ విజయవంతమైందన్నారు. ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఐఏటీవో సిద్ధంగా ఉందన్నారు. విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) చైర్మన్ పీ బసంత్ కుమార్ మాట్లాడుతూ విశాఖ పర్యాటకుల స్వర్గ్ధామంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని హంగులు సమకూరుస్తామన్నారు. ఈ సందర్భంగా ఐఏటీవో ప్రతినిధులకు జ్ఞాపికలు బహూకరించారు.

చిత్రం..ఐఏటీవో సదస్సు ముగింపు సందర్భంగా టూర్ ఆపరేటర్లకు జ్ఞాపిక బహుకరిస్తున్న
కేంద్ర పర్యాటక శాఖ డీజీ సత్యజిత్ రాజన్