బిజినెస్

ప్రభుత్వ డిపాజిట్లు లేని గ్రామీణ బ్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, సెప్టెంబర్ 8: పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్నట్లుగా రీజినల్ రూరల్ బ్యాంక్ (ఏపీజీవీబీ)ల పరిస్థితి దాపురించింది. ప్రభుత్వాలే ఈ బ్యాంకులను ఏర్పాటు చేసి లావాదేవీలు కొనసాగిస్తున్నా అదే ప్రభుత్వాలకు సంబంధించిన డిపాజిట్లకు నోచుకోని వైనం నాలుగు దశాబ్దాలకుపైగా కొనసాగుతోంది. ఈ విషయమై అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పట్టించుకోకపోవడం దురదృష్టకరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే వివిధ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిధులను కేవలం జాతీయ స్థాయి గుర్తింపు పొందిన బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్ చేయాలనే నిబంధనలతో గ్రామీణ బ్యాంకుల పాలిట శాపంగా పరిణమించింది. కోట్లాది రూపాయల వ్యాపారం, వందల కోట్ల లాభార్జనతో దినదినాభివృద్ధి చెందుతున్న ఏపీజీవీబీకి మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఏలాంటి నిధులు డిపాజిట్ కావడం లేదని సంగారెడ్డి రీజినల్ మేనేజర్ మల్లెంపాటి రవి ఆవేదన వ్యక్తం చేసారు. వినియోగదారులకు వివిధ రకాల సేవలు అందిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్న ఏపీజీవీబీకి మాత్రం ప్రభుత్వాల అభివృద్ధి నిధులు డిపాజిట్ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల నిధులు తమ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే లావాదేవీలు మరింతగా పెరగడమే కాకుండా అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లిఖితపూర్వకంగా సమర్పించనున్నట్లు స్పష్టం చేసారు. 1976లో గ్రామీణ వికాస్ బ్యాంకులను ప్రభుత్వం ఏర్పాటు చేయగా అనేక శాఖలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ బ్యాంకుల శాఖల విస్తరించాయి. ప్రభుత్వ పరంగా గుర్తింపులేని బ్యాంకులను నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1969లో మొట్టమొదటగా 14 బ్యాంకులను జాతీయం చేసారు. ఇందులో అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సీబీఐ, దేనా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సిస్ బ్యాంక్, పంజాబ్ నేషన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను కేంద్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకులుగా గుర్తింపునిచ్చింది. 1980 సంవత్సరంలో ఆంధ్రా బ్యాంక్, విజయా బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ అండ్ సింధూ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించింది. 1976లో ప్రభుత్వమే అధికారికంగా ఏర్పాటు చేసిన గ్రామీణ బ్యాంకులకు జాతీయ గుర్తింపునివ్వకపోగా ఆయా సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులను జాతీయ హోదా ఉన్న బ్యాంకుల్లో మాత్రమే డిమాపాజిట్ చేయాలనే నిబంధనలపై గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నిధులు మినహా ఇతర అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన సేవలను తమ బ్యాంకు ద్వారా ఉపయోగించుకుంటున్న ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాల నిధుల డిపాజిట్‌ను మాత్రం తమ బ్యాంకుకు అనుమతించకపోవడం బాధాకరమని పేర్కొంటున్నారు.