బిజినెస్

రెండోరోజూ తగ్గిన పసిడి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 8: దేశంలో బంగారం ధరలు వరుసగా రెండో రోజు శనివారం తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ. వంద తగ్గి, రూ. 31,350కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడంతో పాటు స్థానికంగా డిమాండ్ అంతగా లేకపోవడంతో దేశంలో పసిడి ధర తగ్గింది. అయితే, వెండి ధర మాత్రం పెరిగింది. కిలో వెండి ధర రూ. 275 పెరిగి, రూ. 37,775కు చేరుకుంది. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ మేకర్ల నుంచి కొనుగోళ్లు పెరగడం వల్ల వెండి ధర పెరిగింది. విదేశీ మార్కెట్లలో పసిడి ధర పడిపోవడంతో పాటు స్థానిక నగల వ్యాపారులు, రిటెయిలర్ల నుంచి అంతగా డిమాండ్ లేకపోవడంతో దేశంలో పసిడి ధర తగ్గిందని వ్యాపారులు చెప్పారు. న్యూయార్క్‌లో శుక్రవారం బంగారం ధర 0.28 శాతం తగ్గి, ఒక ఔన్స్‌కు 1,196.20 డాలర్లకు చేరింది. అమెరికాలో ఉద్యోగాలు పెరిగినట్లు సూచించే గణాంకాలు వెలువడటంతో పాటు డాలర్ బలపడటం వల్ల బంగారం విలువ తగ్గిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర పది గ్రాములకు రూ. వంద తగ్గి, రూ. 31,350కి చేరుకుంది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ. వంద తగ్గి, రూ. 31,200కు చేరుకుంది. పది గ్రాముల బంగారం ధర శక్రవారం రూ. 60 తగ్గింది. అయితే సావరిన్ గోల్డ్ ధర శనివారం యథాతథంగా కొనసాగింది. ఎనిమిది గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ. 24,500 పలికింది. మరోవైపు, వెండి ధర కిలోకు రూ. 275 పెరిగి రూ. 37,775కు చేరుకుంది. వారం ప్రాతిపదికన డెలివరీ చేసే వెండి ధర కిలోకు రూ. 140 పెరిగి, రూ. 37,165కు చేరుకుంది. వెండి నాణేల ధర మాత్రం యథాతథంగా కొనసాగింది. వంద వెండి నాణేల కొనుగోలు ధర రూ. 72,000లుగా, విక్రయ ధర రూ. 73,000లుగా కొనసాగింది.