బిజినెస్

ఆరు వారాల లాభాలకు తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: వరుసగా ఆరు వారాల పాటు బలపడిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఈ వారంలో 255.25 పాయింట్లు పడిపోయి 38,389.82 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 91.40 పాయింట్లు పడిపోయి, 11,589.10 పాయింట్ల వద్ద స్థిరపడింది. రూపాయి మారకం విలువ వరుసగా రెండో వారంలో పతనమవుతూ సరికొత్త కనిష్ట స్థాయిలను తాకడం ఈ వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఈ వారంలో ఫోరెక్స్ చరిత్రలో తొలిసారి 72 మార్కుకన్నా దిగువకు దిగజారింది. సరికొత్త జీవనకాల కనిష్ట స్థాయి 72.11 వద్దకు పతనమయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీ మార్కెట్లు బలహీనపడటం వల్ల రూపాయి కూడా పతనమయింది. రూపాయి పతనం దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆందోళనలను రేకెత్తించడంతో పాటు కార్పొరేట్ కంపెనీల లాభాల వృద్ధి అవకాశాలపై సందేహాలను సృష్టించడం మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో ఈ వారంలోని అయిదు రోజుల్లో తొలి మూడు రోజులు దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్రమయిన అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
ప్రపంచ సంకేతాలు బలహీనంగా ఉండటంతో పాటు ముడి చమురు ధరల పెరుగుదల, కీలకమయిన మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ, సేవల రంగం కార్యకలాపాలు మందగించడం కూడా మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అయితే, రూపాయి మారకం విలువ పతనం కీలకమయిన ఆరోగ్య సంరక్షణ, ఐటీ, టెక్నాలజి పరిశ్రమలు లాభపడటానికి దోహదపడింది. వారంలోని చివరి రెండు రోజుల్లో ఇటీవల ధరలు పడిపోయిన విలువయిన షేర్లను చేజిక్కించుకోవడానికి మదుపరులు పూనుకోవడం వల్ల మార్కెట్ కీలక సూచీలు పుంజుకున్నాయి.
బీఎస్‌ఈ సెనె్సక్స్ ఈ వారం 38,915.91 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, గరిష్ఠ స్థాయి 38,934.35 పాయింట్లు, కనిష్ట స్థాయి 38,774.42 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే 255.25 పాయింట్ల (0.66 శాతం) దిగువన ముగిసింది. ఈ సూచీ గత ఆరు వారాలలో కలిసి 2,373.97 పాయింట్లు (6.50 శాతం) పుంజుకుంది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఈ వారం 11,751.80 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, గరిష్ఠ స్థాయి 11,751.80 పాయింట్లు, కనిష్ట స్థాయి 11,393.85 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారంతో పోలిస్తే 91.40 పాయింట్ల (0.78 శాతం) దిగువన 11,589.10 పాయింట్ల వద్ద ముగిసింది.
ఎఫ్‌ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరేబుల్స్, స్థిరాస్తి, పీఎస్‌యూలు, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకులు, పవర్, ఐపీఓలు, చమురు- సహజ వాయువు, వాహన రంగాల షేర్లు ఈ వారంలో ప్రధానంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆరోగ్య సంరక్షణ, లోహ, ఐటీ, టెక్నాలజి రంగాల షేర్లు ఈ వారంలో లాభపడ్డాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల షేర్లు కూడా ఈ వారం గణనీయ స్థాయిలో అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు), విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) కలిసి ఈ వారంలో నికరంగా రూ. 1,916.61 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.
బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఈ వారంలో 376.47 పాయింట్లు (2.23 శాతం) పడిపోయి, 16,504.86 పాయింట్ల వద్ద ముగయగా, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 296.25 పాయింట్లు (1.72 శాతం) పడిపోయి, 16,896.95 పాయింట్ల వద్ద స్థిరపడింది. రంగాల వారీ సూచీలలో ఎఫ్‌ఎంసీజీ 4.59 శాతం పడిపోయింది. కన్స్యూమర్ డ్యూరేబుల్స్ 3.82 శాతం నష్టంతో రెండో స్థానంలో నిలిచింది.