క్రీడాభూమి

ఇక జొకోవిక్‌తో పొట్రో ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 8: ప్రత్యర్థి మోకాలి గాయం అర్జెంటీన్ ఆటగాడు జ్యువాన్ మార్టిన్ డెల్ పొట్రోకు వరమైంది. మోకాలి గాయంతో విలవిల్లాడుతూ స్పెయిన్ ఆటగాడు రాఫెల్ నాదల్ మైదానంలోనే చతికిలపడటంతో, విజేతగా పాట్రో యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరాడు. దీంతో డెల్ పొట్రో, నోవాక్ జొకోవిక్ ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం సెమీఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ రాఫెల్ నాదల్ వరల్డ్ థర్డ్ ర్యాంకర్ డెల్ పాట్రోతో తలపడ్డాడు. 2009 చాంపియన్ పాట్రో 7-6 (7/3), 6-2 ఆధిక్యంలో ఉన్న సమయంలో రాఫెల్ గేమ్‌నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. యూఎస్ ఓపెన్ టోర్నీలో ఎనిమిదోసారి ఫైనల్‌కు చేరిన సెర్బియా స్టార్ ప్లేయర్ జొకోవిక్ 2011, 15 టోర్నీల విన్నర్. కెరీర్‌లో 23 గ్రాండ్ శ్లామ్‌లు సాధించిన జొకోవిక్, తాజా టోర్నీ సెమీస్‌లో జపాన్ సీడ్ నిషికొరిని 6-3, 6-4, 6-2 సెట్లతో మట్టికరిపించి ఫైనల్‌కు చేరాడు. ఇదిలావుంటే పొట్రోతో పదేళ్లలో అనేక టోర్నీల్లో తలపడిన జొకోవిక్ 14సార్లు విజయాలు సాధిస్తే, 4సార్లు ఓటమి చవిచూశాడు. యుఎస్ ఓపెన్ 2007, 2012లో ఒక్క సెట్‌లోనూ పాట్రోకు అవకాశమివ్వకుండా జొకోవిక్ సంపూర్ణ విజయాలు ఆస్వాదించాడు. ‘ఏ ఒక్క గ్రాండ్ శ్లామ్ ఫైనల్‌లోనూ మేమిద్దరం తలపడలేదు. వ్యక్తిగతంగా, ఆటగాడిగా అతనిపై నాకు అపారమైన గౌరవం ఉంది. పొట్రో గొప్పవాడు’ అని జొకోవిక్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. సెమీస్ మ్యాచ్ అనంతరం పొట్రో మాట్లాడుతూ ‘నిజానికి ఇది విజయమని నేననుకోను. సరైన గెలుపు మార్గం కూడా కాదు. రఫాతో ఆడటాన్ని అమితంగా ఇష్టపడతా. ఎందుకంటే టెన్నిస్‌లో అతను తిరుగులేని యోధుడు. మోకాలి గాయంతో మెలికలు తిరిగిపోతూ కూడా రాఫెల్ ఆడుతుంటే చూడలేకపోయాను. నిజానికి రఫా పరిస్థితి విచారకరం. కానీ, నా వరకు నేను అద్భుతంగా ఆడాను’ అని వ్యాఖ్యానించాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో జొకోవిక్, పాట్రోల పోరు రసవత్తరం కానుంది.