అంతర్జాతీయం

లోయలోపడ్డ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాండంగ్, సెప్టెంబర్ 8: ఇండోనేసియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జావా ద్వీపంలో ఓ టూరిస్టు బస్సు లోయలోపడి 21 మంది దుర్మరణం చెందారు. పశ్చిమ జావాలోని బోగోర్ నుంచి ఓ కంపెనీ ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సు లోయలో బోల్తాపడింది. బస్సు సుకాబుని జిల్లాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో 21 మంది చనిపోగా, తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల వాహనం అదుపుతప్పింది. 98 అడుగుల లోతులో బస్సుపడిపోయింది. భద్రతా ప్రమాణాలు, వౌలిక సదుపాయాలు అత్యంత్య పేలవంగా ఉండడం వల్ల ఇండోనేసియాలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి.