జాతీయ వార్తలు

కాషారుూకరణను అడ్డుకుందాం : స్టాలిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇతర జాతీయ పార్టీల నన్నింటినీ నిర్వీర్యం చేసి దేశం మొత్తాన్ని కాషారుూకరించేందుకు ప్రయత్నిస్తోందని డీఎంకె అధ్యక్షుడు స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు. శనివారం ఇక్కడ జరిగిన పార్టీ కార్యదర్శులు, ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశంలో పార్టీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి మాట్లాడారు. డీఎంకె పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్ ఆగస్టు 28న పార్టీ అధినేతగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. పెద్దనోట్ల రద్దు, రాఫెల్ కుంభకోణం, ‘నీట్’, దేశంలో ఆర్థిక పరిస్థితి తదితర అంశాల్లో కేంద్రం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. తమిళనాడు ప్రజల బాగోగులను పట్టించుకోకుండా రాష్ట్రంలో బీజేపీని వ్యతిరేకించే వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు సభలో ‘దేశంలో కాషారుూకరణను నిరోధిద్దాం’ అంటూ ఒక ప్రతిపాదనను ఆమోదించారు. రాష్ట్రంలోని దళితులు, మైనారిటీలపై అణచివేత చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్, ఆదాయ పన్ను విభాగం, సీబీఐలను స్వప్రయోజనాలకు వాడుకుంటోందని అన్నారు. న్యాయ వ్యవస్థను సైతం భ్రస్టు పట్టించారని, ఇందుకు నిదర్శనమే సుప్రీం సీనియర్ న్యాయమూర్తులు బహిరంగ విమర్శలకు దిగాల్సి వచ్చిందని ఆరోపించారు. జీఎస్‌టీ అమలులో విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని, ఆ పార్టీకి కొమ్ముకాసే పార్టీలకు ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఈ నెల 18 నుంచి నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు.