అంతర్జాతీయం

దీపావళికి యుఎన్‌ఓ ప్రత్యేక స్టాంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి (యుఎన్‌ఓ): హిందువులకు అతి పవిత్రమైన, వెలుగులకు చిహ్నమైన దీపావళి పండుగను పురస్కరించుకుని వచ్చే నెల ఐక్యరాజ్య సమితి పోస్టల్ ఏజెన్సీ ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేయనుంది. సంతోషానికి, వెలుగులకు చిహ్నమైన దీపావళి పండుగను భారతదేశంతోపాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆనందంగా జరుపుకుంటారని, ఈ సందర్భంగా అక్టోబర్ 19న ‘హ్యాపీ దీవాలీ’ పేరుతో స్టాంపును విడుదల చేయనున్నట్లు ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ ప్రకటించింది. ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ఈ ప్రకటనను స్వాగతించారు. ‘ఇది రానున్న దీవాలీకి పసందైన బహుమతి’ అని వ్యాఖ్యానించారు.