రాష్ట్రీయం

అజ్ఞాత అవగాహనపై చర్చ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: లోక్‌సభ ఎన్నికల అనంతర పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) నేతలతో సయోధ్య కుదుర్చుకుందనే చర్చ జోరుగా జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యలో ఎంపీల మద్దతు కూటగట్టుకునే క్రమంలో టీఆర్‌ఎస్‌తో సానుకూల వైఖరినే కొనసాగించాలని బీజేపీ అగ్రనాయకులు భావిస్తున్నారని సమాచారం. టీఆర్‌ఎస్‌తో ఘర్షణలు పెట్టుకోవడం ఎందుకనే భావనలో భాగంగానే పలువురు మంత్రులు రాష్ట్రానికి వచ్చినపుడు టీఆర్‌ఎస్ పాలన, రాష్ట్భ్రావృద్ధిపై మెచ్చుకోలు వ్యాఖ్యలు చేసి వెళుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. తద్వారా గత కొంత కాలంగా బీజేపీ కేంద్ర నాయకత్వం వ్యూహాత్మక కార్యాచరణనే అమలుచేస్తోందని చెబుతున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ ‘మీ పని మీరు చేయండి, మిగిలిన విషయాల గురించి ఆలోచించొద్దు. మేం చేయాల్సింది మేం చేస్తాం’ అంటూ స్థానిక నాయకులు, కార్యకర్తలకు పదేపదే చెప్పడం వెనుక ఉద్దేశ్యం కూడా ఇదేనని అంటున్నారు. గతంలో టీడీపీ మద్దతుతో రంగంలోకి దిగిన బీజేపీ ఈసారి ఎవరితో పొత్తు కుదుర్చుకోవాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒక పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు అనుకూలంగా సంకేతాలు పంపించినా, పార్టీ జాతీయ నాయకత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత సారి టీడీపీతో కలిసి పోటీ చేసినపుడు బీజేపీ ఐదు నియోజకవర్గాల్లో మొదటిస్థానంలోనూ, 8 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఒకటి రెండు మినహా మిగిలిన అసెంబ్లీల్లో మూడోస్థానంలో ఉంది. ఇలావుంటే, జాతీయ స్థాయిలో టీఆర్‌ఎస్, బీజేపీ ఇంత వరకూ ప్రత్యక్షంగా ఎలాంటి అవగాహనకు రాకపోయినా, అజ్ఞాతంగా ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిరిందని ఇరు పార్టీల నేతలూ చెబుతున్నారు. శాసనసభ ఎన్నికలు సకాలంలో నిర్వహించేందుకు వీలుగా బీజేపీ మద్దతు కోరిన టీఆర్‌ఎస్, అందుకు ప్రతిగా కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్ధులను గెలిచేందుకు వీలుగా సానుకూల సంకేతాలు ఇచ్చిందన్న చర్చ జరుగుతోంది. అయితే ఈ అవగాహన వార్తలను బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. 105 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ కీలక బీజేపీ నేతలు పోటీచేస్తున్న అసెంబ్లీ స్థానాల్లో మాత్రం అభ్యర్థులను ప్రకటించకపోవడానికి కారణం ఇదేనని చెబుతున్నారు. బీజేపీ 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 45 స్థానాల్లో పోటీ చేసింది. ఉప్పల్, ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, గోషామహల్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్ధులు గెలిచారు. ఖచ్చితంగా గెలుస్తాం అని భావించిన సీట్లలో కూడా బీజేపీ మూడోస్థానం , నాలుగో స్థానంలో నిలవగా, మరికొన్ని చోట్ల డిపాజిట్లను కూడా కోల్పోయింది. అయితే అన్ని స్థానాలకూ పోటీ చేయాలని, గతంలో ఐదు స్థానాలకే పరిమితం కాగా, ఈసారి కనీసం 20 స్థానాలనైనా గెలవాలనే లక్ష్యంగా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. అయితే పలు సందర్భాల్లో కేసీఆర్ బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఆయన చెప్పినట్టే గట్టి అభ్యర్ధులను నిలిపితే బీజేపీ అభ్యర్ధులు ఏ విధంగానూ తట్టుకోలేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. మొన్న ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో ఉప్పల్‌కు టీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్ ముషీరాబాద్, మలక్‌పేట, అంబర్‌పేట, ఖైరతాబాద్, గోషామహల్ అభ్యర్ధులను మాత్రం వెల్లడించలేదు.