రాష్ట్రీయం

కేసీఆర్ హయాంలోనే.. దేవాలయాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నసరుల్లాబాద్, సెప్టెంబర్ 8: రాష్ట్రంలో కేసీఆర్ హాయంలోనే ఆలయాలు అభివృద్ధి చెందాయని మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం నిజాబాద్ జిల్లా బీర్కూర్, నసరుల్లాబాద్ మండలాల్లో గల తెలంగాణ తిరుమల ఆలయం, సోమాలింగేశ్వరాలయం, జోడిలింగాలయాల ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం పోచారం తనయకుడు పోచారం సురేందర్‌రెడ్డి నిర్వహించిన మహా అన్నదానంలో పాల్గొన్నారు. 13 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి చెపాడుతున్న ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా తెలంగాణ తిరుమల దేవాలయాన్ని పరిశీలించారు. ఆనంతరం దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రం మొత్తం మీద నూతనంగా మూడు దేవాలయాలకు ధూపపదీపనైవేద్యని కింద ఒక్కొక్క ఆలయానికి 6 వేల రూపాయలు మంజూరు అయ్యాయన్నారు. నియోజకవర్గంలో 32 ఆలయాల అర్చకులకు ధూపదీపనైవేద్యం ధృవపత్రాలను అందజేశారు. బలహీనవర్గా కాలనీల్లో ఉన్న ఆలయాల నిర్మాణం కోరకు ఒక్కొక్క ఆలయా నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని, నియోజకవర్గంలో 30 ఆలయాలకు నిధులు అందజేస్తామన్నారు. బీర్కూర్ మండలంలో కులసంఘాల కమ్యూనిటీ భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు. ఆనంతరం దుర్గి గ్రామంలో గల సోమాలింగేశ్వరాలయాన్ని దర్శించుకున్నారు. ప్రధాన రహదారి నుంచి ఆలయం వరకు 75 లక్షల రూపాయలతో నిర్మించే సీసీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. 1 కోటీ 57 లక్షల 50 వేల రూపాయలతో సోమాలింగేశ్వరాలయాన్ని అభివృద్ది పరుస్తామన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఆదనపు కమీషనర్ శ్రీనివాస్, టీఆర్ ఎస్ పార్టీ రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, తహసీల్దార్ సంజీవురావు, ఎండీవో హరిసింగ్‌నాయక్, నియోజకవర్గ టీ ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జీ సురేందర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ కిషోర్‌యాదవ్, మాజీ గ్రంథాలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, కృష్ణారెడ్డి, మహేందర్‌రెడ్డి, చిన్న ఎంకన్న, పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి