ఆంధ్రప్రదేశ్‌

వామపక్షాలతోనే ప్రత్యామ్నాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, సెప్టెంబర్ 8: ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పేందుకు వామపక్షాలు ప్రత్యామ్నాయానికి సమాయత్తం అవుతున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ఆగస్టు 29వ తేదీన అనంతపురంలో ప్రారంభమైన రాజకీయ ప్రత్యామ్నాయ మహాగర్జన బస్సు యాత్ర శనివారం ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా కందుకూరులో బహిరంగ సభలో రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. కేంద్రంలో మోదీ అరాచక పాలన కొనసాగిస్తున్నారని, దళితులపై దాడులను ప్రోత్సహిస్తూ దేశ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. చంద్రబాబునాయుడును నమ్మి ప్రజలు అధికారం అప్పగిస్తే సమస్యలను పట్టించుకోకుండా అమరావతి, సింగపూర్, మలేషియా పర్యటనలతో కాలయాపన చేస్తున్నారన్నారు.