ఆంధ్రప్రదేశ్‌

తూకాల్లో తేడాలొస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 8: కార్డుదారులకు తూకాల్లో తేడాలు చూపించే డీలర్లను వదిలిపెట్టేది లేదని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన ఇక్కడి పౌరసరఫరాల సంస్థ ఎంఎల్‌ఎస్ పాయింట్‌ను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పౌరసరఫరాల సంస్థ అప్పులో ఉన్నా పేదలకు పట్టెడన్నం పెట్టాలన్న ఆశయంతో ముందకెళ్తున్నామన్నారు. అలాంటి ఆశయానికి గండి కొడితే సహించేది లేదన్నారు. ఏదైనా డీలరుకు గిట్టుబాటు కాలేదంటే దానిని విడిచిపెట్టవచ్చని హితవు పలికారు. డీలరు తప్పు చేసినప్పుడు తొలగిస్తే దానికి ఎమ్మెల్యేలు, ఎంపీలతో రికమెండేషన్లు చేయిస్తున్నారని, ఏమీ లేకపోతే రికమెండేషన్లు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా డీలర్లకు గౌరవ వేతనం ఇవ్వాలన్న ప్రశ్నకు డీలరు అంటే ఉద్యోగం కాదని, అది ఒక ఉపాధి మాత్రమేనన్నారు. రాష్ట్రంలో 29వేల మంది డీలర్లు ఉన్నారని, వారందరికీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్నారు. ఒక కిలో బియ్యం సరఫరాకు రూ.30 అవుతుండగా, ప్రభుత్వం కేవలం డీలరుకు 0.30 పైసలకు మాత్రమే సరఫరా చేస్తోందన్నారు. డీలరుకు కమిషన్ కింద 0.70 పైసలు చెల్లిస్తుందని వివరించారు. రైస్ మిల్లర్లు తడిచిన ధాన్యం గురించి అడగ్గా నాలుగు నెలలు మీ వద్ద దాచుకొని ఇపుడు కొనుగోలు చేయమంటే తామేం చేసుకుంటామని బదులిచ్చారు. తనకు పదవులపై ఆశ లేదని, తాను కూడా రైతు బిడ్డనేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. డీఎస్‌వో సుబ్బరాజు, జిల్లా మేనేజర్ షర్మిలా, జేసీ కెవి రమణారెడ్డి, ఆర్డీవో మురళీ పాల్గొన్నారు.