ఆంధ్రప్రదేశ్‌

కేంద్రం వేధిస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 8: ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను రాజకీయంగా ఎదుర్కోలేక కేంద్ర ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌పై ఆపరేషన్ గరుడ చేయనున్నారని, రేపోమాపో నోటీసులు వస్తాయని బీజేపీ నేతలు ప్రచారం చేయడం దుర్మార్గమని శనివారం ఒక ప్రకటనలో ఖండించారు. వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి లాంటి వ్యక్తుల ద్వారా తప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నారని, ఒకచేత్తో వైసీపీ అధినేత జగన్, మరోవైపు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ఎక్కించుకుని రాజకీయ క్రీడ ప్రారంభించిందని విమర్శించారు. అవినీతిపరుల అండతో ప్రజాదరణ ఉన్న వారిని కాలరాసేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. కొత్త రాజకీయ పార్టీలను పుట్టిస్తున్నారు, కొత్త వ్యక్తులను తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర సంస్థలను అడ్డంపెట్టుకుని సాధించాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీబీఐ, ఈడీ, సీవీసీ, ఐటీ సంస్థల ద్వారా వేధింపులకు దిగుతోందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామిక వాదులంతా ఏకం కావాలని కోరార. ఒక్కొక్కరిని వేరుచేసి టీడీపీని ఒంటరిని చేసే పన్నాగాలను తిప్పి కొట్టాలన్నారు. గతంలో ఇలాంటి వేధింపు ధోరణలు ఎన్నడూ చూడలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును రాజకీయంగా ఎదుర్కొనే సత్తాలేక వేలకోట్లు దోచిన వారితో బీజేపీ అంటకాగుతోందని దుయ్యబట్టారు. ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన నిధులు నిలిపివేశారని ఆరోపించారు.
దక్షిణాదిలో తమ బలం పెరగదనే నిర్ణయానికి వచ్చి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, తమ చెప్పుచేతల్లోలేని పార్టీలు, వ్యక్తుల అణచివేతకు ఒడిగట్టిందన్నారు. సొంత బలంలేక, పుంజుకునే మార్గం కానరాక దిక్కుతోచని స్థితిలో ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తోందని నిప్పులు చెరిగారు. ఈ కుట్రలకు నిరసనగానే నమ్మకద్రోహం- కుట్ర రాజకీయాలపై పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. ఐదుకోట్ల మంది ప్రజల హక్కులు కాపాడేందుకే కేంద్రంపై పోరాడుతున్నామని తెలిపారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకే కేంద్రం నుంచి వైదొలగామని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబుకు సంఘీభావం పలుకుతున్నారని, ప్రాంతీయ పార్టీల నేతలు టీడీపీకి మద్దతుగా నిలిచారన్నారు. అదిచూసి సహించలేక అడ్డదారులను కేంద్రం వెదుకుతోందని ఆరోపించారు.