ఆంధ్రప్రదేశ్‌

పెట్రో ధరల పెంపుతో కుదేలవుతున్న సామాన్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 8: నాలుగేళ్ల పాలనలో రూ. 1485 కోట్లు ఖర్చు చేసి 53 దేశాలు పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీకి ఒక్క రోజు కూడా పెట్రో ధరలపై సమీక్ష చేయడానికి సమయం దొరకలేదా అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ ప్రశ్నించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ సామాన్యుల కష్టాలు బీజేపీ నేతలకు పట్టవా అన్నారు. ప్రజలపై వేలకోట్ల రూపాయలు భారంపడే పెట్రోల్ ధరలు నియంత్రించలేకపోవడం కేంద్ర ప్రభుత్వం వైఫల్యమంటూ గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో నరేంద్ర మోదీ గతంలో విమర్శించారని, ఇప్పుడు ప్రధాని హోదాలో ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పెట్రో ధరలు తారా జవ్వలా పైపైకి ఎగబాకుతుంటే బీజేపీ ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందన్నారు. పెట్రో ధరల తగ్గింపునకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రధాని మోదీ సామాన్యుల నడ్డివిరుస్తున్నారన్నారు. మరో నెలలో పెట్రోలు ధర లీటరుకు రూ. 100 దాటినా ఆశ్చర్యం లేదన్నారు. ఎన్నో ఆశలతో ప్రజలు నరేంద్రమోదీకి పట్టం కడితే వారి ఆశలను మోదీ వమ్ము చేశారన్నారు. రెండేళ్లలోనే పెట్రోల్‌పై రూ. 23, డీజిల్‌పై రూ. 27 పెంచారన్నారు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. పెట్రో ధరలు తగ్గించని పక్షంలో ప్రజాపోరాటం తప్పదని, మోదీకి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతామన్నారు.