ఆంధ్రప్రదేశ్‌

పృథ్వీరాజ్ భౌతికకాయం స్వస్థలానికి తరలించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 8: అమెరికాలోని సిన్సినాటిలో జరిగిన కాల్పుల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పృథ్వీరాజ్ మృతిచెందటం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర విచారాన్ని వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటీవల కాలంలో తెలుగుప్రజలు ఎక్కువగా ఇలాంటి సంఘటనలకు బలికావటం పట్ల ఆందోళన వ్యక్తంచేశారు. పృథ్వీరాజ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించే విషయమై అమెరికా రాయబార కార్యాలయం సంప్రదింపులు జరపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అమెరికా అదికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు.