ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధి చేస్తున్నందుకు బాబును ఓడిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 8: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే బీజేపీ, వైసీపీ నాయకులకు నిద్రపట్టడంలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని మోదీ నుంచి రక్షించటంమే చంద్రబాబు ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, వైసీపీ తెల్లారితే చాలు చంద్రబాబుని ఓడిస్తామంటున్నాయి.. దేనికి ఓడిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు ఓడిస్తారా? రాష్ట్రంలో రూ. వెయ్యి పెన్షన్ ఇస్తున్నందున ఓడిస్తారా? 5 కోట్ల తెలుగు ప్రజల ఆకాంక్ష అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నందుకు, ప్రతీ సోమవారం, ప్రతీ రోజు ప్రాజెక్టు పురోగతిపై సమీక్షిస్తున్నందుకు ఓడిస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత మిగులు బడ్జెట్‌తో తెలంగాణ, లోటు బడ్జెట్‌తో ఆంధ్ర ఏర్పడ్డాయన్నారు. లోటు బడ్జెట్‌లో నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగున్నర సంవత్సరాలుగా అన్ని విపత్తుల నుంచి బయటపడుతూ, ప్రజల్ని ఆదుకుంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెంపొందించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నారన్నారు.
అనేక సంక్షేమ కార్యక్రమాలు, రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయకత్వంలో మిగతా రాష్ట్రాల కంటే ముందడుగులో ఉందన్నారు. జాతీయ, అంతర్జాతీయ అవార్డుల్లో ముందజంలో ఉంటే రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, వైసీపీ పార్టీ నేతలు చంద్రబాబుని ఓడించడమే తమ కర్తవ్యమనటం సమంజసం కాదన్నారు. చంద్రబాబుని ఓడించడమంటే అభివృద్ధిని ఓడించటమేనన్నారు. 5 కోట్ల మంది ప్రజల అభివృద్ధికి విరుద్ధంగా పని చేయటమే బీజేపీ, వైసీపీల సంకల్పమని డొక్కా అన్నారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న డొక్కా