రాష్ట్రీయం

రూపం మార్చుకున్న ఆపరేషన్ గరుడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 8: రాష్ట్రం పైనా, ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా కక్ష కట్టిన కొన్ని శక్తులు ప్రారంభించిన ఆపరేషన్ గరుడ తన రూపం మార్చుకుని మరోసారి దాడికి సిద్ధమయిందని సినీనటుడు శివాజీ పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునే టార్గెట్ చేసుకున్న జాతీయ పార్టీ మరో సారి తన పంజా విసిరేందుకు సిద్ధమయిందన్నారు. ఇందులో భాగంగానే జాతీయస్థాయిలో రాజ్యాంగబద్ధ సంస్థతో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని శివాజీ సంచలన ఆరోపణలు చేశారు. విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ గరుడ రూపం దాల్చుకుని ఆంధ్రప్రదేశ్‌పై దాడికి ఏర్పాట్లు చేసుకుందన్నారు. రాజకీయకక్ష సాధింపులో ఒక ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. శుక్రవారం అర్ధరాత్రి తనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని చెప్పిన ఆయన వివరాలు మాత్రం అడగవద్దని చెప్పారు. ఆపరేషన్ గరుడలో భాగంగా జాతీయ స్థాయిలోని రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి సోమవారం చంద్రబాబుకు నోటీసులు వస్తాయన్నారు. ఇది అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తనకు సమాచారం వచ్చిందన్నారు. విషయం బయటకు వచ్చింది కాబట్టి నోటీసులు మరికొన్ని రోజులు ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తొలగించడానికి సమయం చూసి జాతీయ పార్టీ పంజా విసురుతుందన్న ఆయన మరో పంజాను సోమవారం విసిరేందుకు సిద్దమైయ్యిందన్నారు. కేంద్రంతో ఢీ కోడితే బెదిరింపులకు దిగడం ఏం సాంప్రదాయమన్నారు. ప్రజలను పక్కన పెట్టి, స్వార్థ రాజకీయ క్రీడను ఆడుతున్నారని తీవ్రంగా ఆరోపించిన ఆయన ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. రాజకీయక్రీడలో స్వార్థరాజకీయాల కోసం రాజకీయ అడ్డు తొలగించుకునేందుకు భారతీయ జనతా పార్టీ నేతలు టెర్రిరిస్టులుగా మారుతున్నారని ఘూటుగా విమర్శించారు. ఇష్టం లేకుండా, లోటు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని విభజించి కనీసం హోదా కూడా ఇవ్వకపోతే ఏప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. ఇచ్చిన మాట తప్పిన భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఏనాడో చచ్చిపోయిందన్న ఆయన త్వరలో ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో పర్యటించి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ప్రధాన మంత్రిని హత్య చేయటం సాధ్యమయ్యే పనేనా అన్న ఆయన వరవరరావు వంటి వ్యక్తులపై ఆరోపణలు సమంజసం కాదన్నారు. ఇది కేవలం పొలిటికల్ పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనన్నారు. తనకు కూడా పలు రాజకీయ పార్టీల నుండి ప్రాణహాని ఉందన్న ఆయన ఈ స్థానంలో వైఎస్ జగన్ ఉన్నా తన ఆందోళన ఇలాగే వ్యక్తం చేసేవాడినని శివాజీ స్పష్టం చేశారు.