తెలంగాణ

‘ముందస్తు’ వేళ ఇంటి పోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 8: టీఆర్‌ఎస్ మళ్లీ అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందస్తుకు అడుగులేసి, ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఆ పార్టీలో ఇంటి పోరు రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వం రద్దుకు ముందే కొన్ని నియోజకవర్గాల్లో నెలకొన్న అంతర్గత విబేధాలు రచ్చకెక్కగా, టికెట్ల కేటాయింపుతో అక్కడ అవి మరింతగా రాజుకుంటున్నాయి. తమ వారికి ఇవ్వకుంటే ఓడిస్తామంటూ కూడా వ్యతిరేక వర్గీయులు బాహటంగానే ప్రకటిస్తున్నారు. ముందస్తు ఎన్నికలతోపాటు ముందస్తుగానే ఎమ్మెల్యేల జాబితాను కూడా విడుదల చేసిన సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని సైతం హుస్నాబాద్ నుంచి మొదలెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు తెరాసకు తలనొప్పిగా మారుతుండగా, పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చొప్పదండి మినహా అన్ని నియోజకవర్గాల్లో సీట్టింగ్‌లకే టికెట్లు ఇచ్చారు. ఇందులో కొందరిపై అసంతృప్తి సెగ వెంటాడుతోంది. ప్రధానంగా రామగుండం టికెట్‌పై నిరసన స్వరాలు పెరుగుతున్నాయి. రామగుండం నియోజకవర్గం నుంచి అక్కడి జడ్పీటీసీ కందుల సంధ్యారాణికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని నిరసిస్తూ శనివారం ఆమె అభిమానులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో సంధ్యారాణి అభిమానులు కండె సాగర్, అంగళి సంపత్‌లు కిరోసిన్ పోసుకొని నిప్పంటిచుకునే ప్రయత్నం చేయగా, వెంటనే వారిని పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. అదేవిధంగా శుక్రవారం కూడా టీఆర్‌ఎస్ రాష్ట్ర నేత కోరుకంటి చందర్‌కు రామగుండం టిక్కెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సింగరేణి కార్మికుడు వేణు ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. సుమారు రెండు గంటల పాటు హల్‌చల్ సృష్టించాడు. టికెట్ కేటాయింపు జరగకముందే తెరాసకు చెందిన రామగుండం మాజీ మేయర్ కొంకటి లక్ష్మినారాయణ, డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, రామగుండం జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, సీనియర్ కోరుకంటి చందర్ తదితరులు రామగుండం తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు వ్యవహారశైలిపై మండిపడటంతోపాటు అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేసిన విషయం విధితమే. కానీ సత్యనారాయణకే టికెట్ ఇవ్వడంతో నిరసన స్వరాలు పెరుగుతున్నాయి. అలాగే మంథని నియోజకవర్గం నుంచి మాజీ శాసనసభ్యుడి కుమారుడు చందుపట్ల సునీల్‌రెడ్డికి టికెట్ కేటాయంచకపోవడాన్ని నిరసిస్తూ కమాన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన టిఆర్‌ఎస్ నాయకురాలు అలుగువెల్లి క్రిష్ణవేణి శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనకు మూడు రోజుల ముందు సునీల్‌రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ దోమ రాహుల్ రెడ్డి అనే టీఆర్‌ఎస్ కార్యకర్త మంథనిలో సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. ఇదిలా ఉండగా, ప్రభుత్వానికి రద్దుకు ముందే వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు వైఖరిపై కూడా అక్కడి టీఆర్‌ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. వేములవాడ ఎంపీపీ రంగు వెంకటేశం గౌడ్ నేతృత్వంలో కొందరు నేతలు ఒక పంక్షన్ హాలో సమావేశమై ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదని, స్థానికంగా ఉండే వారికి ఈసారి ఎమ్మెల్యే సీటు స్థానికంగా ఉండేవారికి ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఇలా రోజురోజుకు కొన్ని నియోజకవర్గాల్లో పెరుగుతున్న ఇంటి పోరు అధికార టీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారుతుండగా, పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.