తెలంగాణ

సమష్టి కృషితో పులిచింతల విద్యుత్ కేంద్రం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేళ్లచెర్వు, సెప్టెంబర్ 8: ఎన్నో అవాంతరాలను అధిగమించి ఇంజనీర్‌లు, అధికారుల సమిష్టి కృషితో పులిచింతల జల విద్యుత్‌కేంద్రాన్ని నేటికి పూర్తి చేశామని తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండి డి.ప్రభాకర్‌రావు అన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద గల జలవిద్యుత్ కేంద్రంలో నాల్గవ యూనిట్‌ను శనివారం ఆయన ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 120 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే విధంగా దాదాపు రూ.560కోట్లతో విద్యుత్‌కేంద్రాన్ని నిర్మించి పూర్తిచేసి తెలంగాణ ప్రజలకు నేడు అంకితం చేశామన్నారు. ఈ జలవిద్యుత్ కేంద్రాన్ని మోడల్ ప్రాజెక్టుగా తీసుకొని తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవం తం చేయాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టుతో రూ.220 మిలియన్లు ప్రభుత్వానికి ఆదా అవుతుందన్నారు. ఈ కేంద్రం ద్వారా ఇప్పటి వరకు 14మిలియన్ యూనిట్‌ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. ప్రాజెక్టు సమీపంలో రూ.28కోట్ల వ్యయంతో ఏడు మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ కేంద్ర నిర్మా ణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పా రు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మృతిచెందిన నలుగురు కార్మికుల మృతికి సంతాపంగా అధికారులంతా నిమిషం పాటు వౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో హైడల్ అధికారులు వెంకటరాజన్, టీఎస్‌ఎస్ పీడీసీఎల్‌డీ సీఎండీ రఘమారెడ్డి, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు, అధికారులు శ్రీనివాసరావు, నర్సింగరావు, అశోక్‌కుమా ర్, సీఈలు, ఎస్‌ఈలు, డీఈలు, ఏఈలున్నారు.