రథం ఫస్ట్‌లుక్ వచ్చేసింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజగురు ఫిలిమ్స్ బ్యానర్‌పై ఏ.వినోద్ సమర్పణలో రాజా దారపునేని నిర్మాతగా తెరకెక్కుతున్న తొలి చిత్రం రథం. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో నూతన నటీనటులు గీత ఆనంద్, చాందిని భాగవానని నటిస్తున్నారు. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నిర్మాత నవీన్ ఎర్నేని, సీనియర్ దర్శకుడు బి.గోపాల్, ఆర్పీ పట్నాయక్ హాజరయ్యారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను నవీన్ ఎర్నేని విడుదల చేయగా.. సీనియర్ యాక్షన్ డైరెక్టర్ బి.గోపాల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ సాంగ్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజాదారపునేని మాట్లాడుతూ... ఈ సినిమా చాలా బాగా వచ్చింది. బ్లాక్‌బస్టర్ హిట్ కొడుతున్నాం. ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. వచ్చే నెల రెండో వారంలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం.