జనతా హోటల్ టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతను ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. కానీ.. ప్రేమిస్తే, షాపింగ్‌మాల్, జర్నీ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించిన సురేష్ కొండేటి ఇప్పుడు మరో చక్కటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ‘మహానటి’ ఫేం దుల్కర్ సల్మాన్, టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం ఉస్తాద్ హోటల్. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను సురేష్ కొండేటి తెలుగులో ‘జనతా హోటల్’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈనెల 14న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న సురేష్ కొండేటి.. ఈ సినిమా విషయంలో మరింత వైవిధ్యాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ను రోజుకో టీజర్ చొప్పున ఏడు రోజులపాటు విడుదల చేయనున్నారు. అందులో భాగంగా మొదటి టీజర్ విడుదలైంది. మగ పిల్లాడు కావాలనుకున్న ఓ తండ్రికి వరుసగా నలుగురు ఆడపిల్లలు పుట్టడం.. అయినా ఆశ చంపుకొని అతడికి ఎట్టకేలకు ఐదో సంతానంగా మగ పిల్లాడు పుట్టడం.. ఆ పిల్లవాడు తండ్రికి నచ్చింది కాకుండా.. తనకు నచ్చింది చేయడం.. చివరికి పెళ్లిచూపుల్లో తన క్వాలిఫికేషన్ గురించి అమ్మాయి అడిగితే.. తాను విదేశాలకు వెళ్లి చదివింది చెఫ్‌కోర్సు మాత్రమేనని చెప్పడం.. ఇలా ఆద్యంతం ఆసక్తిరేకెత్తిస్తున్న సన్నివేశాలతో టీజర్ ఆకట్టుకుంటోంది.