యు టర్న్ సెన్సార్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యుటర్న్. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్ట్ఫికెట్ ఇచ్చారు. ఈనెల 13న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పవన్‌కుమార్ ఈ చిత్రాన్ని మిస్టర్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరియ ప్రమోషనల్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండింటికి దాదాపు 6.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. యుటర్న్ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ్‌లో తెరకెక్కించారు. రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదల కానుంది ఈ చిత్రం. రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో భూమికా చావ్లా ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. పూర్ణచంద్ర తేజస్వి ఈ చిత్రానికి సంగీతం అందించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ కానుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మరియు వివై కంబైన్స్ బ్యానర్స్‌పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు యు టర్న్ చిత్రాన్ని నిర్మించారు. సమంత అక్కినేని, ఆదిపినిశెట్టి, భూమికాచావ్లా, రాహుల్ రవీంద్రన్, నరైన్ తదితరులు నటిస్తున్నారు.