కొత్త దర్శకుడితో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ హీరో గోపీచంద్‌కు ఈమధ్య టైం బాగాలేదు. చేసిన సినిమాలన్నీ వరుసగా ప్లాపులు అవుతున్నాయి. భిన్నంగా ట్రైచేసిన కూడా లాభం లేకపోయింది. దాంతో కొత్త దర్శకుడితో పంతం అంటూ మాస్ యాక్షన్ సినిమా చేసిన అది వర్కవుట్ కాలేదు. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న గోపీచంద్ నెక్స్ట్ సినిమాకు ఓకే చెప్పాడు. ఈసారి కూడా ఆయన కొత్త దర్శకుడితోనే సినిమా చేస్తున్నాడు. కొత్త దర్శకుడు కుమార్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలిసింది. మరి యాక్షన్ సినిమాలు చేస్తే జనాలు రిసీవ్ చేసుకోవడం లేదని.. లౌక్యం తరహాలో ఫన్ అండ్ ఎంటర్‌టైనర్‌కే ఆసక్తి చూపిస్తున్నాడు. దాంతోపాటు ఆయన మరో సినిమాకు ఓకే చెప్పినట్టు తెలిసింది. ఆయన నెక్స్ట్ సినిమా సంపత్ నంది దర్శకత్వంలో ఉంటుందని టాక్. ఇటీవలే వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, కథ నచ్చడంతో గోపీచంద్ ఓకే చెప్పాడట. ప్రస్తుతం సంపత్ నంది స్క్రిప్ట్ వర్క్‌పై బిజీగా ఉన్నాడు.