ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీని రక్షించాలని నేడు కార్మికుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 9: నానాటికీ పెరుగుతున్న డీజిల్ ధరలతో ఆర్టీసీపై సాలీనా దాదాపు రూ. 300 కోట్లకు పైగా అదనపు భారం పడుతున్న నేపథ్యంలో కార్మికులు ఎంతగా శ్రమిస్తున్నా నష్టాలు తగ్గకపోతుండడంతో గుర్తింపు సంఘం ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రంలోని 128 డిపోలు, వర్క్‌షాప్‌ల వద్ద భారీగా ధర్నాలు చేయబోతున్నారు.
ఈసందర్భంగా ఎంప్లారుూస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దామోదర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్లనే ఆర్టీసీ నష్టపోతోందని, తక్షణం డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న డీజిల్ ధరల వల్ల ఆర్టీసీపై పడుతున్న అదనపు ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.