‘ఇష్టంగా’ ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపత్ వి.రుద్ర దర్శకత్వంలో ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తోన్న చిత్రం ‘ఇష్టంగా’. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియదర్శి ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సంపత్.వి మాట్లాడుతూ.. ఇష్టంగా ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్. నేటి జనరేషన్‌లో ప్రేమకున్న, ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఏంటన్న కానె్సప్ట్‌తో ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ యూత్‌ఫుల్ మూవీగా రూపొందుతోంది అన్నారు. నిర్మాత అడ్డూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలోనే ‘ఇష్టంగా’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు. అర్జున్ మహి, తనిష్క్ రాజన్, ప్రియదర్శి, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్, మధునందన్, మధుమణి, విశే్వష్వర్ నెమిలికొండ, ఫిష్ వెంకట్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి రచన సహకారం: చిట్టి శర్మ, సినిమాటోగ్రఫీ: ఆనంద్ నడకట్ల, సంగీతం: యేలేంద్ర మహావీర్, కూర్పు: బొంతల నాగేశ్వర్‌రెడ్డి, మాటలు: శ్రీనాథ్ బాదినేని, పాటలు: చంద్రబోస్, కందికొండ, ఆర్ట్: విజయ్ కృష్ణ, ఫైట్స్: షావలిస్, మల్లేష్, నిర్మాత: అడ్డూరి వెంకటేశ్వరరావు, కథ-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: సంపత్.వి.రుద్ర.