ఆంధ్రప్రదేశ్‌

మోదీ ఆర్థిక విధానాలు విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 9: ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఘోరంగా విఫలమయ్యాయని ఎఐసిసి కార్యదర్శి డాక్టర్ కె జయ్‌కుమార్ విమర్శించారు. ఈవిషయాన్ని మాజీ ఆర్థిక మంత్రి, బిజెపి నేత యశ్వంత్‌సిన్హా, రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్‌లే తేల్చిచెప్పారన్నారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ మోదీ ఆర్థిక విధానాల వల్ల దేశ ఆర్థిక వృద్ధి తిరోగమనంలో పయనిస్తోందని యశ్వంత్‌సిన్హా పేర్కొన్నారన్నారు. దేశంలోని రైతులు, సామాన్య ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పాలు, పెట్రోలు, గ్యాస్ ధరలు, రైల్వే చార్జీలు పెరిగిపోయాయన్నారు. యూపీఏ హయాంలో బ్యాంకుల నిరర్థక ఆస్తులు 1.73 శాతం ఉండగా, ఎన్‌డీఏ హయాంలో 6.67శాతానికి చేరాయని, ఆర్థిక విధానాల విఫలానికి ఇదే నిదర్శమని యశ్వంత్‌సిన్హా పేర్కొన్నారన్నారు. నోట్ల రద్దు ప్రపంచంలోనే ఒక వ్యక్తి చేసిన అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. నోట్ల రద్దు వల్ల దేశవ్యాప్తంగా రూ. 2.25లక్షల కోట్ల నష్టాన్ని కలగజేసిందన్నారు. నల్లధనాన్ని వెలికితీయలేకపోయారన్నారు. నోట్ల రద్దుతో ప్రజధనాన్ని లూటీ చేశారని జయకుమార్ ధ్వజమెత్తారు. 10కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో నిరుద్యోగులు ఐదు శాతం పెరిగారన్నారు. మోదీ హయాంలో సరిహద్దు దేశాలైన చైనా, పాకిస్థాన్‌లతో కూడా సయోధ్య లేదని, కాశ్మీర్‌లో ఇప్పటికీ అశాంతి నెలకొని ఉందన్నారు. పెట్రోధరలు అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్నాయన్నారు. అంతర్జాతీయ ధరలు అనుగుణంగా పెట్రోధరలు ఉంటాయని చెబుతున్న మోదీ యూపీఏ హయాంలో కన్నా 40శాతం తక్కువ ధరకే క్రూడాయిల్ కొనుగోలు చేసి, ఎక్సైజ్ సుంకాన్ని పెంచేసి, పెట్రోధరలు భారీగా పెరిగేందుకు కారణమయ్యారన్నారు. చమురు అమ్మకాలపై మోదీ ప్రభుత్వం 11 లక్షల కోట్లు ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తున్నారని జయ్‌కుమార్ వివరించారు. యూపీఏ హయాంలో కన్నా పెట్రోలు 211శాతం, డీజిల్‌పై 443శాతం ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తున్నారన్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ భారీగా క్షీణించిందన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందన్నారు.
యూపీఏ ప్రభుత్వం మొత్తం 126 రాఫెల్ యుద్ధ విమానాల్లో 18 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భావించిందని, మిగిలిన యుద్ధ విమానాలను దేశీయంగా తయారుచేయాలని నిర్ణయించిందన్నారు. ఒక్కో యుద్ధ విమానాన్ని రూ. 526కోట్లతో కొనుగోలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించిందన్నారు. అయితే ఎన్‌డీఏ ప్రభుత్వం ఒక్కో యుద్ధ విమానాన్ని 1670కోట్లతో 36 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని ఒప్పందం చేసుకుందన్నారు. ఈ వ్యవహారంలో రూ. 41వేల కోట్లకు పైగా అవినీతి జరిగిందని జయకుమార్ ఆరోపించారు. పాలనలో ఘోరంగా విఫలమైన మోదీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని ఆయన పిలుపునిచ్చారు. పెట్రోధరల పెంపును నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్త బంద్ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈబంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.